IND vs BAN 2nd Test: కాన్పూర్‌లోనూ బంగ్లాదేశ్‌కు ఓటమే.. ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
Shakib Al Hasan Injury Update: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
Shakib Al Hasan Injury Update: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్ కాన్పూర్‌లో సెప్టెంబర్ 27 నుంచి జరగనుంది. ఇందులో షకీబ్ అల్ హసన్ ఆడడంపై అనుమానాలు ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో అతని వేలికి గాయమైంది. దాని కారణంగా అతను ఎక్కువగా బౌలింగ్ చేయలేకపోయాడు. మ్యాచ్ కామెంటరీ సమయంలో అతని గాయం నిర్ధారించారు. ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ షకీబ్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అసలు విషయం తెలిపాడు. షకీబ్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇస్తూ.. షకీబ్ బౌలింగ్ చేయకపోవడంతో షాక్‌కి గురయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన తమీమ్ ఇక్బాల్.. షకీబ్ ఇన్ని సమస్యలను ఎదుర్కొంటుంటే, సిరీస్‌కు ముందే టీమ్ మేనేజ్‌మెంట్ ఈ విషయాలపై దృష్టి సారించి ఉండాల్సిందని అన్నాడు. అతని ప్రకారం, మ్యాచ్ ఆడే ముందు షకీబ్‌తో మాట్లాడలేదని, బోర్డు తన బౌలర్ల ఆరోగ్యంతో ఆటలు ఆడుతోందనేందుకు ఇదే నిదర్శనం. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అంటూ తెలిపాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సెలెక్టర్లలో ఒకరైన హనన్ సర్కార్ మాట్లాడుతూ, "షకీబ్ మా అత్యుత్తమ ఆటగాడు. అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నప్పుడు, జట్టు కూడా బాగుటుంది. మేం ఎల్లప్పుడూ తదుపరి మ్యాచ్‌కి ముందు షకీబ్ ఎంపిక గురించి ఆలోచిస్తాం. తదుపరి మ్యాచ్ ప్రారంభానికి ఇంకా సమయం మిగిలి ఉంది" అంటూ తెలిపాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ తీయలేకపోయాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతను మొదటి, రెండవ ఇన్నింగ్స్‌లో వరుసగా 32, 25 పరుగులు చేశాడు.