మొదటి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్!

Update: 2019-06-17 14:24 GMT

వరల్డ్ కప్ టోర్నీ లో భాగంగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఎనిమిది వికెట్లకు 321 పరుగులు చేసింది. 322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ దూకుడుగా తమ ఛేజింగ్ మొదలు పెట్టారు. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్టూ నష్టపోకుండా 53 పరుగులు చేశారు. ఇక్బాల్ నిదానంగా ఆడగా.. సౌమ్య సర్కార్ దూకుడుగా ఆడాడు. రెండు ఫోర్లు, రెండు సిక్స్ ల సహాయంతో 23 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అదే ఊపులో మరో షాట్ కు ప్రయత్నించి రస్సెల్ బౌలింగ్ లో గేల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తరువాత హాసన్ క్రీజులోకి వచ్చాడు.  మొత్తమ్మీద 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ బాంగ్లాదేశ్ ఒక్క వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. ఇక్బల్ 26 పరుగులతోనూ, హాసన్ 8 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News