మొదటి పది ఓవర్ల వరకూ వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసి ఊపు మీద కనిపించిన అఫ్గాన్ బ్యాట్స్ మెన్ మొదటి వికెట్ పాడడం తోనే నెమ్మదించారు. అక్కడ నుంచి నత్త నడకలా వారి బ్యాటింగ్ సాగుతోంది. పదకొండో ఓవర్ ప్రారంభంలోనే ఓపెనర్ రెహ్మత్ (24; 35 బంతుల్లో) షకిబ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మొసాదిక్ వేసిన 20 వ ఓవర్లో షాహిది (11; 31 బంతుల్లో) ఔటయ్యాడు. దీంతో అఫ్గాన్ బ్యాటింగ్ మరింత నెమ్మదించింది. మొత్తమ్మీద 26 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 24 ఓవర్లలో 162 పరుగులు చేయాల్సి ఉంది. నాయిబ్ 22 పరుగులతోనూ, అస్ఘర్ 12 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.