Baba Ramdev's Patanjali : ఐపీఎల్ లోకి రాందేవ్ బాబా పతంజలి!
Baba Ramdev's Patanjali : అసలు ఈ ఏడాది ఐపీఎల్ మొదలవుతుందా లేదా అని అనుమానాలకి గత కొద్ది రోజుల క్రితం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
Baba Ramdev's Patanjali : అసలు ఈ ఏడాది ఐపీఎల్ మొదలవుతుందా లేదా అని అనుమానాలకి గత కొద్ది రోజుల క్రితం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.. కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ 13 వ సీజన్ ని భారత్ లో నిర్వహించేందుకు అవకాశం లేకపోవడంతో టోర్నీకి UAE కి షిఫ్ట్ చేసింది బీసీసీఐ.. అక్కడ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించేలా ప్లాన్ చేసింది బీసీసీఐ.. దీనికి సంబంధించిన షెడ్యుల్ ని త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. మొత్తం మ్యాచ్ లను యూఏఈలోని మూడు స్టేడియంలో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది.
ఇక ఇది ఇలా ఉంటే.. ఇప్పటి వరకు టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగుతున్న వివో మొబైల్ ఈ ఏడాదికి ఒప్పందం రద్దు చేసుకుంది. దీనితో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి దాదాపు రూ.440 కోట్ల వరకు నష్టపోనున్నాయని సమాచారం.. దీనితో టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం త్వరలో బీసీసీఐ టెండర్లు నిర్వహిచనుంది.. అయితే దీనికి గాను అమెజాన్, బైజుస్, డ్రీమ్ 11, అన్‌అకాడమీ వంటి కంపెనీలు బాగానే ఆసక్తిని చూపిస్తున్నాయి..
ఇప్పడు ఈ కంపెనీలతో పాటుగా రేసులోకి కొత్తగా రాందేవ్ బాబా అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పతంజలి సంస్థ కూడా చేరిపోయింది. పతంజలి సంస్థ లిస్టులోకి రావడంతో మిగతావాటికి పోటి ఎక్కువైంది.. అయితే ఇప్పుడు ఎంతమొత్తానికి టెండర్ వేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.. దాదాపుగా 200 కోట్లకి మించి చెల్లించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగస్టు 18 లోగా టోర్నమెంట్ కొత్త టైటిల్ స్పాన్సర్‌ను బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.