కత్రినా పాటకి కూతురితో కలిసి స్టెప్స్ వేసిన వార్నర్

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా క్రికెట్ ప్రపంచం నిలిచిపోయిన సంగతి తెలిసిందే.. దీనితో అందరూ ఆటగాళ్ళు ఈ సమయాన్ని తమ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు.

Update: 2020-04-18 15:46 GMT
David warner

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా క్రికెట్ ప్రపంచం నిలిచిపోయిన సంగతి తెలిసిందే.. దీనితో అందరూ ఆటగాళ్ళు ఈ సమయాన్ని తమ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. అందులో భాగంగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కుటుంబంతో నాణ్యమైన ఈ సమయాన్ని గడుపుతున్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ లోని కత్రినా కైఫ్‌ ఆడిపాడిన పాపులర్‌ సాంగ్ 'షీలాకీ జవానీ..' అనే పాటకి తన కూతురుతో కలిసి టిక్‌టాక్‌ చేశారు.

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు వార్నర్.. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. దయచేసి నాకు ఎవరైనా సహాయం చెయ్యండి అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే ఈ వీడియో నెటిజన్లుని వీపరీతంగా నవ్విస్తోంది. కేవలం పది గంటల్లోనే 6 లక్షల మందికిపైగా వీక్షించారు. తండ్రీకూతురు సరదాగా చేసిన ఈ టిక్‌టాక్‌ వీడియోప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.



Tags:    

Similar News