ఆసీస్ అద్భుత విజయం

Update: 2019-06-12 17:18 GMT

ప్రపంచ కప్ లో మరో ఉద్విగ్న పోరు. భారీ స్కోరు ఖాయం అనుకున్న దశలో చక్కని బౌలింగ్ తో ఓ మోస్తరు స్కోరుకు పరిమితమయ్యేలా చేశారు. అబ్బే.. కష్టమైన స్కోరు.. పాకిస్తాన్ దగ్గరకు కూడా రాలేదు అనుకున్న స్థితి నుంచి.. ఏం జరుగుతుందో అనేలా చేశారు. అబ్బ ఎంత బాగా ఆడుతున్నారో.. కంగారూలనే కంగారు పెడుతున్నారు అనుకున్నంతలోనే బ్యాట్లు ఎత్తేసి విజయాన్ని ప్రత్యర్థికి అప్పచేప్పేశారు. ఇదీ స్థూలంగా వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా తో పాకిస్థాన్ మ్యాచ్ లో పాక్ తీరు. గెలవడానికి 60 బంతుల్లో 78 పరుగులు అవసరమైన దశ నుంచి.. 36 బంతుల్లో 44 పరుగులు అవసరమైన దశకు చేరుకొని.. 24 బంతులు మిగిలిఉండగానే.. విజయం ముందు బోర్లా పడ్డారు. చివరి 3 వికెట్లూ కేవలం 3 పరుగుల తేడాతో కోల్పోయిన పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. 200 పరుగులకు ఏడు వికెట్ల నుంచి 264 పరుగుల వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా జాగ్రతగా ఆడిన పాక్ చివరి మూడు వికెట్లనూ మూడు పరుగుల తేడాతో చేజార్చుకుంది.

భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ పడుతూ లేస్తూ ముందుకు సాగింది. అయితే ఓ దశలో విజయాన్ని సాధించే దిశలోకి వెళ్ళింది. మరో రోమాంచిత మ్యాచ్ చూస్తున్నామా అనిపించేలా చేసింది. ఇక్కడే నిలకడ లేమికి తాము కచ్చితంగా బ్రాండ్ అంబాసిడార్లే అనిపించుకుంటూ పేలవమైన ముగింపును నాలుగు ఓవర్ల ముందుగానే ఇచ్చేసింది.

విజయానికి 308 పరుగులు చేయాల్సి ఉండగా 45 .4 ఒవర్ల్లలో కేవలం 266 పరుగులు మాత్రమె చేయగలిగింది పాకిస్థాన్. దీంతో 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఆస్ట్రేలియా జట్టులో కమిన్స్ మూడు వికెట్లు తీయగా, స్టార్క్, రిచర్డ్సన్ రెండేసి వికెట్లు, నేల్, ఫించ్ చెరో వికేట్టూ తీశారు. 


పాకిస్థాన్ బ్యాటింగ్..



 

















ఆస్ట్రేలియా బౌలింగ్.. 



 


Tags:    

Similar News