ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన టీ20 వార్మప్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తమ ఆటగాళ్ల కోసం వాటర్ బాయ్ అవతారం ఎత్తారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస స్టేడియంలో క్రికెట్ ఆడుతోన్న ఆటగాళ్ల కోసం స్వయంగా డ్రింక్స్ తీసుకవచ్చాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ ప్రధాని రిజర్వ్ ప్లేయర్‌లాగా మారారడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తూ గ్రౌండ్ నుంచి వెళ్లిపోయారు. క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని స్కాట్ మోరిస ఈ రకంగా చాటుకున్నారు.
Australia's Prime Minister Scott Morrison brought out the drinks in the middle for Prime Minister XI's side during their warm up game against Sri Lanka. WHAT A GESTURE 🙌 #AUSPMXIVSL #AUSvSL pic.twitter.com/V3BDzoUo4x
— Cricket Huddle (@CricketHuddle) October 24, 2019