మొదటి వికెట్ కోల్పోయిన ఆసీస్

Update: 2019-06-12 11:09 GMT

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన తోలి వికెట్ ను కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఫించ్ ‌(82; 84బంతుల్లో) పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆమిర్‌ బౌలింగ్‌లో 23ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌ ఆడి హఫీజ్‌ చేతికి చిక్కాడు. అంతకు ముందు వార్నర్ తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరుకు పునాదులు పడ్డాయి. ఈ దశలో ఫించ్ అవుటయ్యాడు. స్మిత్ క్రీజులోకి వచ్చాడు. మొత్తమ్మీద 23 ఓవర్లకు ఆస్ట్రేలియా జట్టు 141/1 స్కోరు చేసింది. వార్నర్ 52(55), స్మిత్ 1(1) బ్యాటింగ్ చేస్తున్నారు.  ఈ వరల్డ్ కప్ lO వార్నర్ కు ఇది మూడో అర్థ సెంచరీ కావడం గమనార్హం. 

Tags:    

Similar News