AUS vs NZ : అదుగో బాల్ అక్కడ ఉంది.. గల్లీ క్రికెటర్లలా బాల్ కోసం.. వైరల్ వీడియో
న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆసక్తికర ఘనట చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో బాల్ కోసం గల్లీ క్రికెటర్లల ప్లేయర్లు బాల్ కోసం వెతకడం అందరిని ఆశ్చర్యపరిచింది.
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అన్ని రంగాల పైన పడుతుంది. ఇక క్రీడా రంగంపైన దిని ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ వైరస్ ప్రభావంతో జరవాల్సిన పలు సిరీస్‌లు రద్దు అయ్యాయి. తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల జట్ల మధ్య జరుగుతు తొలి వన్డేలో క్రికెటర్ల మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుంది. గ్రౌండ్ లో ప్రేక్షకులు లేరు, బాల్ అందించేదుకు గ్రౌండ్ బాయిస్ లేకపోవడంతో క్రికెటర్లే బాల్ కోసం స్టాండ్స్ లో వెతుకుతు కనిపించారు. పలువురు అభిమానులు ఈ సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
కొందరూ నెటిజన్లు క్రికెటర్లను చూసి వీళ్లు అంతర్జాతీయ క్రికెటర్ల కాదు గల్లీ క్రికెటర్ల కనిపిస్తున్నారని ట్వీట్ చేస్తున్నారు. మరి కొందరూ తమ అభిమాన క్రికెటర్ల కష్టాలను చూసి బాధ పడుతున్నారు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డలే ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది.
ఓపెనర్లు వార్ణర్ (67), కెప్టెన్ ఫించ్(60) పరుగులతో రాణించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ కు 124 పరుగులు జోడించారు. మార్నాస్ 56 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 41 ఓవర్లో 187 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 71 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మార్టిన్ గుప్తిల్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కామిక్స్, మార్ష్ చేరి మూడు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ సమయంలో ఆసీస్ ఆరోన్ ఫించ్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. ఈ క్రమంలో విలియమ్సన్ తన చేతిని వెనుకకి తీసుకున్నాడు. ఇది గమనించిన ఇద్దరు కెప్టెన్లు కాసేపు నవ్వుకున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ర్టేలియా తన ట్విటర్‌లో షేర్ చేసింది. ఆ తర్వాత మోచేతులతో ట్యాప్ చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ ఏంచుకొంది. స్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. టాస్ వేసే సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఎప్పటినుంచో వస్తోంది.