పదిలంగానే లక్ష్మణ్ 20 ఏళ్ల రికార్డు

Update: 2020-02-14 17:04 GMT

భారత టెస్ట్ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌ రికార్డు పదిలంగానే ఉంది. ఓ అరుదైన రికార్డును చేరుకునే క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ క్రికెటర్ రాహుల్ దలాల్ తృటిలో చేజార్చుకున్నాడు. లక్ష్మణ్ 1999_2000 రంజీ సీజన్‌‌లో అత్యధికంగా 1,415 పరుగులు చేసి లక్ష్మణ్ అగ్రస్థానంలో నిలిచాడు. 20 ఏళ్ల నుంచి ఆ రికార్డు పదిలంగానే ఉంది. తాజాగా మేఘాలయతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అరుణాచల్ బ్యాట్స్‌మన్ రాహుల్ దలాల్ రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో ఒక రంజీ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన లక్ష్మణ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని రాహుల్ చేజార్చుకున్నాడు.  

Tags:    

Similar News