పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్ళ మధ్య మరియు కోచ్ మధ్య కలహాలు మరోసారి బయటపడ్డాయి .. ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది . టోర్నీలో లీగ్ దశ నుండే నిష్క్రమించింది .ఇది ఇలా ఉంటే పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా సర్ఫరాజ్ అహ్మద్ పనికిరాడంటూ పాకిస్థాన్ క్రికెట్ కోచ్ మికీ ఆర్థర్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి లేఖ రాశాడు. అతని స్థానంలో పరిమిత ఓవర్లకు షాదాబ్ ఖాన్ ను మరియు టెస్ట్ లకు బాబర్ అజామ్ ను కెప్టెన్ గా నియమించాలని అందులో పేర్కొన్నాడు . అంతే కాకుండా జట్టు మరింత ప్రదర్శనను చేయాలంటే తనకి మరింత సమయం కావాలని కోరాడు . పాకిస్థాన్ జట్టు అతడి నేతృత్వంలోనే ఐసీసీ చాంపియన్స్ ట్రోపీని గెలుచుకుంది . మరి దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ...