7 పరుగులకి అందరు ఆలౌట్ .. అందులో 10 మంది డకౌట్
ఇక చేజింగ్ కి దిగిన చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్ జట్టును స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ బౌలర్లు దెబ్బకొట్టారు.
గల్లి క్రికెట్ లో కూడా ఇలాంటి స్కోర్ నమోదు కావచ్చు బహుశా.. కానీ ఓ రెండు స్కూల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ జట్టు అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తే అందుకు భిన్నంగా మరో జట్టు తన ఆటను కనబరిచింది. ముంబైలోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్, చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్ మధ్య అండర్ 19 తొలి రౌండ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తోలుతగా బ్యాటింగ్ కి దిగిన స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ 39 ఓవర్లకి గాను 761 పరుగులు చేసింది. ఇందులో మాయేకర్ ట్రిపుల్ సెంచరీ (338 56 *4 7*6) చేశాడు ..
ఇక చేజింగ్ కి దిగిన చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్ జట్టును స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ బౌలర్లు దెబ్బకొట్టారు. ఆ జట్టు బౌలర్లు అయిన అలోక్ పాల్ కేవలం మూడు ఓవర్లలో మూడు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీయగా, మరో బౌలర్ వరోద్ వెజ్ రెండు ఓవర్లలో మూడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మిగిలిన ఇద్దరు రనౌట్ అయ్యారు. ఇందులో ఒక్కరు కూడా ఒక్క పరుగు కూడా చేయలేదు. వచ్చిన ఏడూ పరుగులు కూడా అదనపు పరుగులు కావడం విశేషం.. వీరి ఇన్నింగ్స్ కేవలం ఆరు ఓవర్లలో ముగియడం ఇక్కడ మరో విశేషం.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.