వరల్డ్ కప్ టోర్నీ లో భాగంగా వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్నా మ్యాచ్ లో విండీస్ భారీ స్కోరు సాధించింది. ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసి ఆఫ్ఘాన్లకు 212 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. నామమాత్రంగా ఈ మ్యాచ్ లో విండీస్ బ్యాట్స్ మెన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. క్రిస్ గేల్ ప్రారంభం లోనే ఔటయినా లూయీస్, హోప్ చక్కని సంయమనంతో బ్యాటింగ్ చేశారు. లూయీస్ అర్థ సెంచరీ తరువాత అవుటయినా హాప్ మాత్రం జాగ్రత్తగా ఆడుతూ కొనసాగాడు. 30 వ ఓవర్లో హాప్ అర్థ సెంచరీ సాధించాడు. అతనికి హెట్‌మైయిర్ చక్కని సహకారం అందించాడు. 35 ఓవర్లో హెట్‌మైయిర్(39; 31బంతుల్లో) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దవ్లత్ బౌలింగ్‌లో ఐదో బంతికి షాట్ ఆడిన హెట్‌మైయిర్.. నూర్ అలీ చేతికి చిక్కాడు. తరువాత వచ్చిన పూరం హోప్ తో కలసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. నబి బౌలింగ్‌లో 38 ఓవర్లో షాట్ ఆడిన హోప్(77; 92బంతుల్లో) రషీద్ ఖాన్ చేతికి చిక్కాడు. తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ హోల్డర్ తో కలిసి పూరన్నిలకడగా ఆడాడు. 48 ఓవర్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. హోల్డర్ బాధ్యతాయుతంగా ఆడటంతో పటు చివరి ఓవర్లో ఇద్దరు చెరో సిక్స్ కొట్టి.. 20 పరుగులు సాధించడంతో వెస్టిండీస్ మూడువందల దాటింది.