వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఓటమి దిశలో ఉంది. 15 ఓవర్లకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓవర్లు ఉన్నప్పటికీ కీలక వికెట్లు పడిపోవడంతో ఇంకా మిగిలిన 122 పరుగులను చేయడం కష్టతరమైన పనే. సవరించిన లెక్కల ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ విజయ లక్ష్యం 41 ఓవర్లలో 187 పరుగులు. వర్షం కారణంగా దాదాపు రెండున్నర గంటలపాటు ఆట నిలిచిపోవడంతో మ్యాచ్ ను 41 ఓవర్లకు కుదించారు.