వరల్డ్ కప్ లో భాగంగా 312 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘాన్ దీటుగా స్పందిస్తోంది. రెండో ఓవర్లోనే ఓపెనర్ గుల్బదిన్ (5) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడ్డ టీం ను రహమత్, ఇక్రం ఆడుకున్నారు. సంయమనంతో ఆడుతూ, చెత్త బంతుల్ని షాట్లు గా మలుస్తూ ఇద్దరూ చక్కగా ఆడుతున్నారు. 12 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది అఫ్ఘన్. రహమత్ (21), ఇక్రం (23) పరుగులతో క్రీజులో ఉన్నారు.