రాజ్ కోట్ వన్డే లో కీలక వికెట్ కోల్పోయింది భారత్ .. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 78 (76) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జంపా వేసిన 43 ఓవర్ లోని మొదటి బంతికి భారీ షాట్ ఆడబోయిన కోహ్లి బౌండరీ వద్ద స్టార్క్ కి దొరికిపోయాడు ప్రస్తుతం భారత జట్టు 44 ఓవర్ లకి గాను నాలుగు వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో కేయల్ రాహుల్ 44 (9) మనిష్ పాండే 2(4) పరుగులతో ఉన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ42 (44), శిఖర్ ధావన్ 96(90), శ్రేయాస్ అయ్యర్ 7 (17) ఔట్ అయ్యారు.