ఇండియా విండీస్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి..

ఇండియా వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అడ్డంకిగా మారింది. ఈ మ్యాచ్ ప్రారంభంలో వర్షం కారణంగా కొంత సేపు మ్యాచ్ నిలిచిపోయింది.

Update: 2019-08-14 15:55 GMT

ఇండియా వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అడ్డంకిగా మారింది. ఈ మ్యాచ్ ప్రారంభంలో వర్షం కారణంగా కొంత సేపు మ్యాచ్ నిలిచిపోయింది. మళ్ళీ 22 ఓవర్లు ముగిసాకా జల్ల్లులు పడుతుండడంతో ఆటను నిలిపివేశారు. ఆట నిలిపేసరికి విండీస్ 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. హోప్‌ (19), హెట్‌మైయిర్‌ (18) నిలకడగా ఆడుతున్నారు. అంతకు ముందు విండీస్ ఓపెనర్లు భారత బౌలింగ్ ను ఊచ కోత కోసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఒకే ఓవర్ లో ఒపెనర్లిద్దరూ అవుటవడంతో తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఆచి, తూచి నిదానంగా ఆడుతున్నారు.


Tags:    

Similar News