వెస్టిండీస్ తో రెండో వన్డే: కోహ్లీ అర్థ శతకం
వెస్టిండీస్ తో జరుగుతున్నా రెండో వన్డేలో కెప్టెన్ కోహ్లీ తన అర్థ శతకాన్ని నమోదు చేశాడు. అంతకు ముందు వెస్టిండీస్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్ లో రెండో వన్డే ఈరోజు జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వన్డే వర్షార్పణం అయిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే, బ్యాటింగ్ మొదలు పెట్టిన వెంటనే..భారత్ కు షాక్ తగిలింది. కాట్రెల్ వేసిన మూడో బంతికే ధావన్ (2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ తో కలసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను నిలబెట్టే పనిలో పడ్డాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతున్నారు. ఒక పక్క రోహిత్ ఆచి తూచి ఆడుతుంటే, మరో పక్క కోహ్లీ తనదైన శైలిలో ఆడుతున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు బాదిన ఆటగాడిగా పాక్ క్రికెటర్ జావేద్ (1930 పరుగులు) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఆ తరువాత కూడా రోహిత్ నిదానంగా ఆడుతుండగా.. కోహ్లీ పరుగులు తీస్తున్నాడు. 15వ ఓవర్లో విరాట్ కోహ్లీ(50) అర్ధశతకం బాదాడు. బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో బౌండరీని బాది 57 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మొత్తమ్మీద 15 ఓవర్లకు భారత్ 76/1 తో ఉంది మరోవైపు రోహిత్ శర్మ (18) కోహ్లీకి అండగా ఉన్నాడు.