రాంచి టెస్ట్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ
♦ ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో కోహ్లీసేన విజయం ♦ సౌతాఫ్రికాతో సిరీస్‌ను తొలిసారి క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ♦ 3-0 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా ♦ 10 నిమిషాల్లోనే ముగిసిన 4 వ రోజు ఆట
రాంచి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. నాలుగో రోజు ఆట మొదలైన 10 నిమిషాల్లోనే సౌతాఫ్రికా చివరి వికెట్లను కోల్పోయింది. దీంతో 3-0 తో సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకుంది.
4 వ రోజు కేవలం 2 ఓవర్లే ఆడిన సఫారీలు చేతులెత్తేశారు. దీంతో సౌతాఫ్రికాతో సిరీస్‌ను భారత్ తొలిసారిగా క్లీన్‌స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు 497 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫాలో ఆన్ ఆడిన సౌతాఫ్రికా టీమ్ 133 పరుగులకు ఆలౌట్ అయ్యింది.