ఒకే ఒక్క మార్పు..సౌతాఫ్రికా తొ టెస్ట్ సిరీస్ కి టీమిండియా
దక్షిణాఫ్రికాతో తలపడబోయే భారత్వె జట్టు కోసం వెస్టిండీస్ తో ఆడిన జట్టులో ఓకే ఒక్క మార్పు చేశారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ పై వేటు వేసిన సెలక్టర్లు యువ ఆటగాడు శుభామాన్ గిల్ ను తీసుకున్నారు.
దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ కి భారత జట్టును ప్రకటించారు. వెస్టిండీస్ టూర్ లో ఆడిన జట్టునే దాదాపుగా ఖాయం చేసిన సెలక్టర్లు ఓపెనర్ కేఎల్ రాహుల్ పై వేటు వేశారు. విండీస్ తో సిరీస్ లో వరుసగా రాహుల్ విఫలం కావడంతో అతన్ని పక్కకి తప్పించి యువ ఆటగాడు శుభామన్ గిల్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇక రోహిత్ శర్మ ను విండీస్ టూర్ కి సెలెక్ట్ చేసినా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అతనికి దక్కలేదు. ఈసారి సౌతాఫ్రికాతో రోహిత్ ని ఓపెనర్ గా ఆదిన్చానున్నట్టు బోర్డ్ ప్రకటించింది. సౌరవ్ గంగూలీ చేసిన సూచన మేరకు ఈ మార్పు జరిగినట్టు తెలుస్తోంది.
ఇండియా జట్టు ఇదీ..
విరాట్ కోహ్లి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా (రెండో వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభమన్ గిల్