టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌!

Update: 2019-07-09 09:18 GMT

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో తొలి సెమీస్ మాంచెస్టర్‌ ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పిచ్ తొలుత బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతోంది. సౌథీ స్థానంలో ఫెర్గూస‌న్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక‌, భార‌త్ కూడా ఒక మార్పుతోనే బ‌రిలోకి దిగుతోంది. కుల్దీప్ స్థానంలో చాహ‌ల్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

న్యూజిలాండ్‌ జట్టు

మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌, కేన్‌ విలియమ్సన్‌, రాస్ టేలర్‌, టామ్‌ లేథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, లాకీ ఫెర్గూసన్‌, మాట్‌ హెన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌

భారత జట్టు

లోకేశ్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌పంత్‌, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

Tags:    

Similar News