Viral Video: ఉర్ఫీ జావేద్‌ను మించిపోయేలా ఉందే.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: కొంత మంది ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ స్టైలిష్‌గా మెరిసిపోతే, మరికొందరు మాత్రం కొత్తదనం కోసం ప్రయోగాలు చేస్తుంటారు.
Viral Video: ఉర్ఫీ జావేద్‌ను మించిపోయేలా ఉందే.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: కొంత మంది ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ స్టైలిష్‌గా మెరిసిపోతే, మరికొందరు మాత్రం కొత్తదనం కోసం ప్రయోగాలు చేస్తుంటారు. ఫ్యాషన్ ప్రపంచంలో వినూత్న ఆలోచనలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారతాయి. తాజాగా ఓ యువతి తన కస్టమ్ డిజైన్ డ్రెస్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ అమ్మాయి గోనె సంచితో డిజైనర్ డ్రెస్సు తయారు చేయించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు.
ఈ గోనె సంచి డ్రస్‌ను దూరం నుంచి చూస్తే మోడ్రన్ అవుట్‌ఫిట్‌లా కనిపిస్తోంది. అయితే దగ్గరికి వెళ్లి చూస్తే కానీ అసలు విషయం తెలుస్తోంది. ఈ అమ్మాయి గోనె సంచితో డిజైన్ చేసిన ప్యాంట్, టాప్ వేసుకొని స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోంది. అంతేకాదు, ఆ డ్రెస్సును మరింత అట్రాక్టివ్‌గా మార్చేందుకు రెడ్ కలర్ ఆర్టిఫిషియల్ పువ్వులతో అలంకరించింది. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఈ డిజైన్ వరల్డ్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్లను కూడా ఆశ్చర్యపరిచేలా ఉంది" అని కామెంట్ చేస్తుంటే, మరికొందరు "నువ్వు ఊర్ఫీ జావేద్ చెల్లెలా? ఆమెను కాపీ కొడుతున్నావా?" అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండియన్స్ ట్యాలెంట్‌కి ఇది నిదర్శనం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు స్పందిస్తూ.. ఈమె కచ్చితంగా ఉర్ఫీని మించిపోయేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.