PM Kisan: పీఎం కిసాన్ యోజనకు ఒక రైతు కుటుంబంలో ఎంత మంది అప్లై చేసుకోవచ్చు?
PM Kisan 20th Installment Eligibility: పీఎం కిసాన్ యోజన రైతు ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు జమా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్లమంది రైతులు ఈ లబ్ధి పొందుతున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ యోజనకు ఒక రైతు కుటుంబంలో ఎంత మంది అప్లై చేసుకోవచ్చు?
PM Kisan 20th Installment Eligibility: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక చేయూతని అందిస్తుంది. వారి వ్యవసాయ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఏడాదికి రూ.6000 అంటే 3 విడతల్లో ఈ డబ్బును జమా చేస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా రూ.2000 చొప్పున రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తుంది. అయితే ఫిబ్రవరి 24వ తేదీ 19వ విడత నిధులను మంజూరు చేసింది. 20వ విడత నిధుల మంజూరు జూన్‌లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ యోజనకు మీరు దరఖాస్తు చేసుకున్నారా ?
అయితే కుటుంబంలో ఎంతమంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు తెలుసుకుందాం. 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రారంభించింది. ఈ పథకంలో రెండు ఎకరాలకు లోపు ఉన్న రైతులకు ప్రతి ఏడాది రూ.6000 చొప్పున నిధులు మంజూరు చేస్తారు. అయితే దీనికి ఈ కేవైసీ ముందుగానే పూర్తి చేసుకొని ఉండాలి. అది మాత్రమే కాదు భూమి రికార్డులు బ్యాంకు ఖాతా కూడా ఉండాలి.
ఒకే కుటుంబానికి చెందిన ఎంతమంది ఈ యోజనకు అర్హులు అవుతారు? ఒక రైతు కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరూ లేదా ఇతర సభ్యులు కూడా ఈ యోజనకు అర్హులు అవుతారా? పొందగలరా అంటే కాదు అని అర్థం ఒక కుటుంబంలో కేవలం ఒకరు మాత్రమే అర్హులు భూమి రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తికి మాత్రమే పీఎం కిసాన్ నిధులు జమ చేస్తారు. ఇతర కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్న ఆ పత్రాలను తిరస్కరిస్తారు
పీఎం కిసాన్ 20వ విడత నిధుల మీరు అర్హులు కావాలంటే ముందుగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇక బెనిఫిషీయరీ స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్లో మీ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. అయితే దీనికి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటిపి ద్వారా మీ బెనిఫిషియరీ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 1800115526 అనే హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి వివరాలు పొందవచ్చు.