
Viral Video: కస్టమర్ సైజును బట్టి డిస్కౌంట్ ఇచ్చే రెస్టారెంట్
Variety discount offer for food lovers: ఫుడ్ లవర్స్ రెస్టారెంట్‌కు వెళ్తే అక్కడ దొరికే అన్నిరకాల టేస్టీ ఫుడ్స్ ట్రై చేయాలని అనుకుంటుంటారు. కానీ బిల్లు చినిగి చాటంతయి జేబుకు చిల్లు పెడుతుందనే భయం వెంటాడుతుంటుంది. అందుకే బడ్జెట్ ప్రకారం మెనూలోంచి ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటుంటారు. మరి అదే రెస్టారెంట్‌లో మీ పర్సనాలిటీ సైజ్‌ను బట్టి డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ ఇస్తే ఎలా ఉంటుందో చెప్పండి!!
అరెరె.. ఈ ఆఫర్ ఏదో బాగుందే అని అనుకుంటున్నారా? ఐతే ఈ ఆఫర్‌లో ఒక ట్విస్ట్ ఉందండోయ్... అదేంటో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఈ ఆఫర్ ఏంటి, దానివెనుకున్న ట్విస్ట్ ఏంటనేది తెలియాలంటే ముందుగా ఈ వీడియో చూడండి. పరిస్థితి ఏంటో మీకే అర్థమవుతుంది.
చూశారు కదా... రెస్టారెంట్ ఎంట్రన్స్‌లో ఒక గ్రిల్ లాంటి గేట్ ఏర్పాటు చేశారు. కనీసం 5 శాతం నుండి 10%, 15%, 20% వరకు నాలుగు రకాల ఎంట్రీలు ఏర్పాటు చేశారు. ఎంట్రీపై చూపించినట్లుగా 5 శాతం డిస్కౌంట్ ఉన్న ఎంట్రీలోంచి వెళ్లే వారికి అంతమేర డిస్కౌంట్ ఇస్తారు.
ఒకవేళ ఎవరైనా సన్నగా ఉన్న వారు 20 శాతం డిస్కౌంట్ ఎంట్రీలోంచి లోపలికి వెళ్లగలిగితే, అంత మొత్తం డిస్కౌంట్ ఇస్తారు. కానీ అందులోంచి వెళ్లాలంటే ఎంతో సన్నగా ఉన్న వారికి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యపడదు.
5% డిస్కౌంట్ ఆఫర్ ఉన్న ఎంట్రీలోంచి కూడా వెళ్లలేని వారు ఆ పక్కనే ఉన్న మరో పెద్ద ఎంట్రీలోంచి వెళ్లాల్సి ఉంటుంది. అది విశాలంగా ఉంటుంది. కానీ ఎలాంటి డిస్కౌంట్ ఉండదు. ఒక వ్యక్తి 15శాతం డిస్కౌంట్ ఉన్న ఎంట్రీలోంచి వెళ్లేందుకు ట్రై చేసి అది కుదరకపోవడంతో చివరకు 5% డిస్కౌంట్ ఉన్న ఎంట్రీలోంచి వెళ్లడం వీడియోలో చూడొచ్చు.
ఇంతకీ ఈ రెస్టారెంట్ ఎక్కడుందనే కదా మీ డౌట్... థాయ్‌ల్యాండ్‌లో చియాంగ్ మయి అనే నగరంలో చియాంగ్ మయి బ్రేక్‌ఫాస్ట్ వరల్డ్ అనే రెస్టారెంట్ వారు తమ హోటల్‌కు వచ్చే కస్టమర్స్ కోసం ఈ ఏర్పాట్లు చేశారు.
ఆ రెస్టారెంట్ యాజమాన్యం చేసిన ఈ వెరైటీ ప్రయోగం విమర్శలకు కారణమైంది. లావుగా ఉన్న కస్టమర్స్‌ను బాడీ షేమింగ్ చేయడం కోసమే ఈ తరహా ఆఫర్స్ పెట్టారని నెటిజెన్స్ మండిపడుతున్నారు.