Viral Video: అరే బుడ్డోడా.. అది బొమ్మకాదురా పాము.. ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు ఖాయం..!
Shocking Viral Video: సోషల్ మీడియాలో ప్రతీ రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కాస్త భిన్నంగా ఉంటే చాలు నెట్టింట ఓ రేంజ్ ట్రెండ్ అవుతున్నాయి.

Shocking Viral Video: సోషల్ మీడియాలో ప్రతీ రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కాస్త భిన్నంగా ఉంటే చాలు నెట్టింట ఓ రేంజ్ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయంతో వణికిపోతున్నారు. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
పామును దూరం నుంచి చూడాలంటేనే భయమేస్తుంది. అలాంటి పామును ఎంచక్కా బొమ్మలా ఆడుకుంటుంటుంటే ఎలా ఉంటుంది.? అది కూడా ఓ చిన్న పిల్లవాడు. అయితే ఇది నిజంగా జరిగింది ఓ బుడ్డొడు పాముతో ఎంచక్కా ఆడుకున్నాడు. సోఫాలో కూర్చున్న కుర్రాడి చేతిలో ఓ పాము ఉంది. ఆ కుర్రాడు అదేదో బొమ్మలాగా దాన్ని చేతులో పట్టుకొని ఆడుతున్నాడు. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఈ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో సీరియస్ అవుతున్నారు. బుడ్డోడి కుటుంబ సభ్యులపై ఫైర్ అవుతున్నారు. అపాయం నుంచి ఆ పిల్లాడిని కాపాడాల్సింది పోయి సరదాగా చూస్తూ వీడియో తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా ఫేమస్ అవ్వాలి, వ్యూస్ రావాలని ఇలా అభంశుభం తెలియని చిన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటారా.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఓసారి వీడియోను మీరు కూడా చూసేయండి.