AC Tricks: ఏసీ కూలింగ్ ఎక్కువగా రావాలంటే ఎంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలో తెలుసా?
AC Installation Guide: ఈ వేసవి కాలంలో కూలర్లు, ఏసీలు ఇంట్లో తప్పనిసరి. అయితే ఏసీలు ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే అవి ఎంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి? ఎంతమందికి తెలుసు?

AC Tricks: ఏసీ కూలింగ్ ఎక్కువగా రావాలంటే ఎంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలో తెలుసా?
AC Installation Guide: ఎండాకాలం మొదలైపోయింది.. వాతావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలలు ఇదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి జూలై వరకు సమ్మర్ హీట్ తప్పదు. ప్రతి ఇంట్లో ఏసీ ఉండాల్సిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే గరిష్టంగా మీ ఇల్లు చల్లగా ఉండాలంటే ఏసీ ఎంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలో ఎంతమందికి తెలుసు?
మీరు విండో ఏసీ, లేదా స్ప్లిట్ ఏసీ.. రెండిట్లో ఏది ఉపయోగిస్తున్నారో దానికి అనుగుణంగా ఇన్స్టాలేషన్ ప్రక్రియ ఉంటుంది. అయితే ఎక్కువ శాతం అందరూ ఇళ్లలో స్ప్లిట్ వేసి మాత్రమే వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో మీరు ఏసీ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే దాని ఎత్తు కూడా ఎంతో ముఖ్యం. తద్వారా గరిష్టంగా మీ ఇంటిని చల్లబరుస్తుంది.
మీ ఇంట్లో స్ప్లిట్ ఏసీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే దాదాపు 7 నుంచి 8 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల త్వరగా ఇల్లంతా కూల్ అయిపోతుంది. అయితే ఒకవేళ మీ సీలింగ్ 9 ఫీట్లు ఉంటే కాస్త కిందకు ఈ ఏసీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సీలింగ్ తగ్గట్టుగా ఏసీ ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఫ్లోర్ నుంచి 8 ఫీట్ల హైట్ లో ఉండాలని గుర్తుంచుకోండి.
అంటే మరీ సీలింగ్ దగ్గరగా ఏర్పాటు చేసుకోవద్దు. ఇలా చేయడం వల్ల గది చల్లబడదు. అంతేకాదు ఎండాకాలంలో ఈ ఏసీలు మంటలు కూడా చెలరేగడం చూసే ఉన్నాం . ఇది కొన్ని ఉత్పత్తుల్లో డిఫెక్ట్ రావడం వల్ల జరుగుతుంది. ఏసీలను అతి జాగ్రత్తగా ఉపయోగించాలి. టెక్నీషియన్ ఆధ్వర్యంలో మాత్రమే ఏర్పాటు చేసుకోండి. కచ్చితంగా ముందుగా సర్వీసింగ్ చేసిన తర్వాత ఉపయోగించండి. గ్యాస్ లీకేజీలు ఏమైనా జరుగుతున్నాయా? అని కూడా చెక్ చేయించడం మంచిది. అంతేకాదు ఫ్లవర్ ఫ్లక్చయేషన్ ఏరియాలో ఉంటే కచ్చితంగా స్టెబిలైజర్ పెట్టుకోండి.