Viral Video: అక్క ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.. వైరల్‌ అవుతోన్న వీడియో

Viral Video: పాము అనే పేరు విన్నా చాలామందికి గుండె ఝళ్లుమంటుంది. దూరం నుంచి పాము కనిపించినా వెంటనే పారిపోతుంటాం.

Update: 2025-04-06 10:00 GMT
Viral Video

Viral Video: అక్క ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.. వైరల్‌ అవుతోన్న వీడియో

  • whatsapp icon

Viral Video: పాము అనే పేరు విన్నా చాలామందికి గుండె ఝళ్లుమంటుంది. దూరం నుంచి పాము కనిపించినా వెంటనే పారిపోతుంటాం. మరీ ముఖ్యంగా చిన్న బొద్దింకలకే భయపడే మహిళలు పాములను పరార్‌ అవుతారు కదూ! అయితే ఓ మహిళ మాత్రం పామును ఏదో పొట్ల కాయను పట్టుకున్నట్లు పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఓ కార్యాలయంలో కంప్యూటర్ల మధ్య చొరబడ్డ పామును చూసిన ఉద్యోగులు గజగజ వణికిపోతుంటారు. ఎవరూ దరిచేరాలంటే కూడా వెనకాడుతుంటారు. కానీ ఆ సమయంలో ఓ మహిళ ధైర్యంగా లోపలికి వచ్చింది. కంప్యూటర్ల వెనకాల నక్కిన పాము ఒంటి చేత్తో బయటకు తీసింది. ఆమెతో పాటు తీసుకొచ్చిన సంచిలో వేసుకొని ఎంచక్కా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

దీనంతటినీ అక్కడే ఉన్న వారు స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్‌, లైక్స్‌ కురిపిస్తున్నారు. ఇక మరికొందరు స్పందిస్తూ ఈ అక్క ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అన్నారు. మరి కొందరు కామెంట్‌ చేస్తూ ఈమె కచ్చితంగా స్నేక్‌ క్యాచ్‌ అయి ఉండొచ్చని కామెంట్స్‌ చేశారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైర్‌ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ షాకింగ్‌ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.



Tags:    

Similar News