Vikshanam: సరికొత్త మిస్టరీ థ్రిల్లర్‌గా "వీక్షణం" ఆకట్టుకుంటుంది: దర్శకుడు మనోజ్ పల్లేటి
Vikshanam: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "వీక్షణం". ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Vikshanam: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "వీక్షణం". ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "వీక్షణం" సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో డీఎఫ్ టీ కోర్స్ చేశాను. ఒకరోజు విక్టరీ వెంకటేష్ ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసుకోవడం అని ఆయన అన్నారు. వెంకటేష్ గారు చెప్పిన ఆ మాటే ఈ సినిమా లైన్‌కు మూలం. అక్కడి నుంచి వీక్షణం సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ వచ్చాం. స్క్రిప్ట్ రెడీ అయ్యాక కొంతమంది ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లాను. స్క్రిప్ట్ బాగుందని వారు చెప్పినా కొత్త దర్శకుడు ఎలా తీస్తారో అని డౌట్ పడ్డారు. నేను ఎక్కువమందిని కలిసినా కొద్దీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ బాగుందని అనడం నా కాన్ఫిడెన్స్ పెంచింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉన్న ప్రొడ్యూసర్స్ నా కథ బాగుందని అంటున్నారంటే ఇందులో కంటెంట్ ఉంది అనిపించింది. వీక్షణం థియేట్రికల్ ఎక్సీపిరియ్స్ ది బెస్ట్ గా ఉంటుంది. సంతోషంగా లైఫ్ లీడ్ సాగిస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చి ఎలాంటి ఇబ్బందులు తీసుకొచ్చింది అనేది మా మూవీ కాన్సెప్ట్. వీక్షణం సినిమా మెయిన్ లీడ్ ఆర్టిస్టులు అందరికీ పేరు తెస్తుంది. హీరోతో పాటు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ థియేటర్ లో చేసే సందడి మామూలుగా ఉండదు. త్వరలో నా నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేస్తామని అన్నారు.
అనంతరం సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ - సంగీత దర్శకుడు కోటి గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడే ఎంఎస్ రాజు గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. ఆయన డైరెక్ట్ చేసిన 7 డేస్, 6 నైట్స్ అనే మూవీకి మ్యూజిక్ చేశాను. వీక్షణం సంగీత దర్శకుడిగా నాకు రెండో సినిమా. ఈ సినిమాలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ, లవ్, రొమాన్స్ వంటి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇలాంటి కథకు మ్యూజిక్ చేసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను. హీరో రామ్ కార్తీక్ చాలా బాగా నటించాడు. మా టీమ్ అంతా కష్టపడి కాకుండా ఇష్టపడి మూవీ కోసం వర్క్ చేశాం. ఈ నెల 18న థియేటర్స్ లో మా మూవీ చూసి సపోర్ట్ చేయండి అని అన్నారు.