Post Office Gram Suraksha Yojana: రోజూ రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
Post Office Gram Suraksha Yojana: ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. మారిన ఆర్థిక అవసరాలు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో చాలా మంది ముందు నుంచే పొదుపు చేస్తున్నారు.
Post Office Gram Suraksha Yojana: ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. మారిన ఆర్థిక అవసరాలు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో చాలా మంది ముందు నుంచే పొదుపు చేస్తున్నారు. ఆదాయం ఆర్జించడం మొదలు పెట్టిన రోజు నుంచే సేవింగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఎన్నిరకాల పొదుపు పథకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ అందిస్తోన్న అలాంటి ఓ బెస్ట్ స్కీమ్ గురించి ఈరోజు తెలుసుకుందాం..
గ్రామ సురక్ష యోజన పేరుతో పోస్టాఫీస్ ఒక మంచి పెట్టుబడి స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో రోజుకు రూ. 50 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ. 30 లక్షలు పొందొచ్చు. ఇది కేవలం పొదుపు పథకం మాత్రమే కాకుండా.. హెల్త్ అండ్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీ కూడా. 19 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పథకంలో చేరొచ్చు. ప్రీమియంను నెలవారీగా, మూడు నెలల ప్రాతిపదికన, 6 నెలలకు ఓసారి, సంవత్సరానికి ఒకసారి చెల్లించుకోవచ్చు.
ఇక ఈ పథకం మెచ్యూరిటీ పీరియడ్ 55 ఏళ్లు, 58 సంవత్సరాలు, 60 ఏళ్లుగా ఉంటుంది. మీ వయసును బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 19 ఏళ్లు ఉన్న వ్యక్తి రూ. 10 లక్షల ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే.. అతను 55 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజకు 50 రూపాయలన్నమాట. అదే.. అతను 58 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే.. అప్పుడు నెలకు రూ.1,463 ప్రీమియం చెల్లించాలి. 60 సంవత్సరాల వరకైతే రూ.1,411 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు ఈ పథకంలో రోజు రూ. 50 పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మెచ్యూరిటీ సమయానికి రూ. 31.60 లక్షలు వస్తాయి. 19 నుంచి 58 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే 33.40 లక్షలు, 60 ఏళ్ల వరకైతే రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి. 80 ఏళ్లు నిండిన తర్వాత మెచ్యూరిటీ సొమ్మును పొందొచ్చు. అయితే ఒకవేళ పాలసీదారుడు మధ్యలో మరణిస్తే.. మీ స్కీమ్, అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియం ఆధారంగా నామినీకి చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌ను సంప్రదించండి.