Find Mistake: మీ థింకింగ్‌ పవర్‌కు ఒక పరీక్ష.. ఇందులో ఉన్న తప్పును గుర్తించండి చూద్దాం..!

Find Mistake: మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి. మరి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కూడా ఒక వ్యాయామం ఉంటుంది.

Update: 2024-07-22 15:30 GMT

Find Mistake: మీ థింకింగ్‌ పవర్‌కు ఒక పరీక్ష.. ఇందులో ఉన్న తప్పును గుర్తించండి చూద్దాం.. !

Find Mistake: మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి. మరి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కూడా ఒక వ్యాయామం ఉంటుంది. మెదడుకు పని చెప్పడమే ఈ వ్యాయామం. అందుకే క్రాస్‌ వర్డ్స్‌, పజిల్స్‌ వంటి గేమ్స్‌ను ఆడుతుంటారు. ఇలాంటి వాటివల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది.

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి పజిల్స్‌కు బాగా ప్రాచుర్యం పెరిగింది. మన మెదడుకు పదును పెట్టే ఇలాంటి ఫొటోలను ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలుగా చెబుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్‌ అవుతోంఇద. అలాంటి ఫొటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఒక బాలుడు కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్నట్లు కనిపిస్తోంది కదూ! అక్కడే కొన్ని పుస్తకాలు, ఒక పిల్లి ఉంది. అయితే ఈ ఫొటోలో ఒక తప్పు దాగి ఉంది. దీనిని కనిపెట్టడమే ఈ పజిల్‌ ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులోని ఆ తప్పును కేవలం 10 సెకండ్లలో గుర్తించగలగాలి అప్పుడే మీ ఆలోచన తీరు సూపర్‌గా ఉంటుందని అర్థం. ఇంతకీ ఆ తప్పును కనిపెట్టారా.? ఓసారి ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే ఆ తప్పెంటో తెలిసిపోతుంది.

ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్‌ ఏంటో గుర్తించారా.? అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే తప్పును గుర్తు పట్టొచ్చు. ఎంత ప్రయత్నించినా సమాధానం దొరకడం లేదా.? అయితే ఓసారి గోడకు ఉన్న వాచ్‌ను గమనించండి. అందులో ఉన్న నెంబర్స్‌ తప్పుగా ఉన్నాయి. 3వ స్థానంలో ఉండాల్సింది 8వ స్థానంలో ఉంది. అదే ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్‌.

Tags:    

Similar News