Optical Illusion: ఇంట్రెస్టింగ్ పజిల్.. ఈ ఫొటోలో ఉన్న మనిషిని కనిపెట్టగలరా?
Optical Illusion: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు భారీగా ఆదరణ లభిస్తోంది.
Optical Illusion: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు భారీగా ఆదరణ లభిస్తోంది. రకరకాల ఇంట్రెస్టింగ్ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో కొన్ని మన ఆలోచన శక్తికి పదును పెడితే, మరికొన్ని కంటి చూపును పరీక్షిస్తాయి. అలాంటి ఓ వెరైటీ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పైన ఉన్న ఫొటో చూడగానే.. సహజంగానే ఒక ఆవు కనిపిస్తోంది కదూ! అయితే ఈ ఫొటోలోనే ఒక మనిషి ఫొటో కూడా దాగి ఉంది. ఆ మనిషి ముఖాన్ని కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పజిల్‌ను సాల్వ్ చేయడం అంత సులభమైన విషయం మాత్రం కాదండోయ్. చూసే కళ్లను మాయ చేసే ఈ పజిల్‌ను చేధించాలంటే మీ కంటి చూపు ఓ రేంజ్‌లో ఉండాలి.
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న మనిషి ఫొటో కనిపించిందా.? ఓసారి ఫొటోను తీక్షణంగా గమనించండి. మనిషి ముఖం ఇట్టే కనిపిస్తుంది. ఏంటి ఎంత ప్రయత్నించినా సాల్వ్ చేయలేకపోతున్నారా.? అయితే ఓసారి ఆవు నుదుటిని జాగ్రత్తగా గమనించండి. సమాధానం అక్కడే దాగి ఉంది. ఆవు నుదిటిపై మనిషి ముఖం కనిపిస్తుంది. లేదంటే ఫొటోను 90 డిగ్రీలు తిప్పి చూసినా కనిపిస్తుంది. ఇంత చెప్పినా మీరు పజిల్‌ను సాల్వ్ చేయలేకపోతే ఓసారి కింద ఉన్న ఫొటో చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది.