Photo Illusions: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆప్టికల్ ఇల్యూజన్‌తో పాటు ఫొటో పజిల్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. మన ఐక్యూతో పాటు కంటి పవర్‌ను పరీక్షించే ఈ ఫొటోలు నిత్యం ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి ఫొటో పజిల్స్‌ను సాల్వ్ చేసే క్రమంలో వచ్చే ఆనందమే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే సోషల్ మీడియాలో వీటి కోసం ప్రత్యేకంగా పేజీలను క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఓ ఫొటో పజిల్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. పైన ఉన్న ఫొటో చూడగానే ఓ యువతి హాల్‌లో కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్నట్లు కనిపిస్తోంది కదూ! అయితే ఈ ఫొటోలో 3 తప్పులు ఉన్నాయి. వాటిని గుర్తించడమే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ ఆ మూడు తప్పులు ఏంటో గుర్తించారా.?
ఒకసారి ఫొటోలో ఉన్న అన్ని వస్తువులను జాగ్రత్తగా గమనిస్తే సమాధానం ఇట్టే గుర్తించవచ్చు. మరి కంటి చూపుతో పాటు మెదడుకు పనిచేప్పే ఈ పజిల్‌ను మీరు సాల్వ్ చేశారా? ఏంటి ఎంత ప్రయత్నించినా పజిల్‌ను సాల్వ్ చేయలేకపోతున్నారా? కేవలం 10 సెకండ్లలో పజిల్‌ను సాల్వ్ చేస్తే మీ ఐ పవర్ సూపర్ అని అనుకోవాల్సిందే.
ఇక సమాధానం విషయానికొస్తే.. ఈ ఫొటోలో మొత్తం మూడు తప్పులు ఉన్నాయి. ఒకటి ఆ యువతి ధరించిన చెప్పులు రెండు వేరువేరుగా ఉన్నాయి. అదే విధంగా క్యాలెండర్‌లో జూన్ నెల కనిపిస్తోంది. అయితే జూన్ నెలలో 31 రోజులు ఉండవు. ఇక మూడో తప్పు విషయానికొస్తే.. యువతి పైన ఉన్న గడియారంలో అంకెలు రివర్స్‌లో ఉన్నాయి.