Viral Video: క్యాబేజీలో పాము.. కూరగాయలు కొనేటప్పుడు జాగ్రత్త.. వైరల్ అవుతున్న వీడియో..!

Viral Video: చలికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లలో క్యాలీఫ్లవర్ విపరీతంగా వస్తుంది.

Update: 2024-11-20 08:25 GMT

Viral Video: క్యాబేజీలో పాము.. కూరగాయలు కొనేటప్పుడు జాగ్రత్త.. వైరల్ అవుతున్న వీడియో..!

Viral Video: చలికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లలో క్యాలీఫ్లవర్ విపరీతంగా వస్తుంది. దాని రుచి, అది అందించే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ కూరగాయలను ప్రధానంగా ప్రతి ఇంట్లో వాడుతుంటారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ క్యాలీ ఫ్లవర్ తినేవాళ్లను షాకింగుకు గురి చేస్తుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి క్యాలీ ఫ్లవర్ కోస్తుండగా ఒక్కసారిగా దాని లోపల నుండి పాము బయటకు వచ్చింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది వాటిని కొనేందుకు భయపడుతున్నారు, ఎందుకంటే క్యాలీ ఫ్లవర్ లో ఇంత ప్రమాదకరమైన జీవి కనిపించడం చాలా ఆందోళన కలిగించే విషయం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ వంటి కూరగాయలలో అనేక రకాల జెర్మ్స్, బ్యాక్టీరియా ఉండవచ్చు, ఇది మానవులకు హానికరం. అందువల్ల, వాటిని బాగా కడగడం, శుభ్రం చేయడం చాలా ముఖ్యం.. తద్వారా ఈ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ వంటి కూరగాయలను కత్తిరించే ముందు, దానిని వేడి నీటిలో బాగా కడిగి శుభ్రం చేయాలని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, క్యాబేజీ కాడ, క్యాలీ ఫ్లవర్ లో దాగి ఉన్న సూక్ష్మక్రిములను నివారించడానికి వాటిని కత్తిరించేటప్పుడు జాగ్రత్త వహించాలి. క్యాబేజీలో ఏదైనా క్రిములు, పురుగులు, పాము లాంటివి కనిపిస్తే వెంటనే వాటని పడవేయాలని, చిన్న వైతే వాటని తీసేసి పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే కూరగాయలను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు, కత్తిరించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియోను చూస్తే స్పష్టమవుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే తినే ముందు పరిశుభ్రత అవసరమని ఈ సంఘటన గుర్తు చేస్తుంది.

Tags:    

Similar News