Photo puzzle: ఎండిన ఆకులు కనిపిస్తున్నాయి కదూ! ఇందులోనే ఓ పిల్లి దాగి ఉంది. కనిపెట్టారా?
తాజాగా ఇలాంటి ఓ ఫోటోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
సవాళ్లను స్వీకరించే వారికి ఫొటో పజిల్స్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. వీటిని సాల్వ్ చేయడంలో భలే కిక్కు ఉంటుంది. అందుకే వీటికి ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో ఆలోచన శక్తిని టెస్ట్ చేసేవి కొన్ని అయితే.. కంటి చూపును పరీక్షించేవి మరికొన్ని ఉన్నాయి.
తాజాగా ఇలాంటి ఓ ఫోటోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. పైక కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.? ఓ అటవీ ప్రాంతంలో ఎండి ఆకులు, కర్రెలు ఉన్నాయి కదూ! అయితే ఇదే ఫొటోలో ఓ చిన్న పిల్లి పిల్ల దాగి ఉంది. దానిని కనిపెట్టడమే ఈ ఫోటో పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ మీరు ఆ పిల్లిని కనిపెట్టారా.?
ఓసారి ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే పిల్లిని ఇట్టే కనిపెట్టొచ్చు. అయితే పిల్లిని కనిపెట్టడం మాత్రం సులభమైన విషయం కాదు. ఎందుకంటే అచ్చంగా అక్కడ ఉన్న ఎండిన ఆకుల రంగులోనే ఆ పిల్లి ఉండమే దీనికి కారణం. అయితే జాగ్రత్తగా గమనిస్తే మాత్రం కనిపెట్టొచ్చు. ఏంటి ఎంత ప్రయత్నించిన పిల్లిని గుర్తించలేకపోతున్నారా.? అయితే ఓసారి ఫొటోలో ఎడమవైపు కింద జాగ్రత్తగా గమనించండి. అక్కడే నక్కినక్కి దాగున్న పిల్లి కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా పిల్లి కనిపించకపోతే సమాధానం కోసం కింద ఫొటో చూడండి.