వాట్సప్ లో సరికొత్త ఫీచర్ రాబోతోంది!

Update: 2019-07-23 05:58 GMT

వాట్సప్ అంటే తెలీని వారుండరు. ఇప్పుడు హలో పలకరింపుల కంటే.. వాట్సప్ విశేస్సే ఎక్కువ. దాదాపుగా అందరూ ఛాటింగ్ లో మునిగి తేలుతున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా వాట్సప్ కూడా ఎన్నో మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు తాజాగా వాయిస్ మెసేజ్ కి సంబంధించి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

ఇంతవరకూ టెక్స్ట్ మెసేజ్ లో తప్పులు వస్తే సరి చేసుకోవడానికి వీలుంది. అలానే ఇమేజ్ మెసేజ్ కూడా అవసరమైతే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ, వాయస్ మెసేజ్ లో ఆ సౌకర్యం లేదు. ఏదన్నా తప్పు మాటలు ఆ సందేశంలో దోర్లినట్టు తెలిసినా దానిని సరిచేయగలిగే వీలు లేదు. ఈ సమస్యను అధిగమించడానికి వాట్సప్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటికే ఆ ఫీచర్ ఐవోఎస్‌లో బీటా దశలో ఉంది. దీనిని త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేవడానికి వాట్సప్ కృషి చేస్తోంది. సో, ఇక వాట్సప్ వాయిస్ మెసేజ్ లు మరింత బాగా పంపించుకోవచ్చన్నమాట. 

Tags:    

Similar News