వామ్మో.. ప్రపంచంలోనే అతి ఖరీదైన ఇల్లు భారత్‌లోనే ఉందని మీకు తెలుసా? ధరెంతో తెలిస్తే మూర్ఛపోతారంతే..
బకింగ్‌హామ్ ప్యాలెస్ అంటే ప్రపంచానికి బ్రిటన్ రాణి ప్యాలెస్ అని తెలుసు. ఇలాంటి విలాసవంతమైన ప్యాలెస్ భారతదేశంలోనూ ఉందని మీకు తెలుసా. భారతదేశంలోని ఈ ప్యాలెస్ చాలా పెద్దది
బకింగ్‌హామ్ ప్యాలెస్ అంటే ప్రపంచానికి బ్రిటన్ రాణి ప్యాలెస్ అని తెలుసు. ఇలాంటి విలాసవంతమైన ప్యాలెస్ భారతదేశంలోనూ ఉందని మీకు తెలుసా. భారతదేశంలోని ఈ ప్యాలెస్ చాలా పెద్దది. ఇందులో 4 బకింగ్‌హామ్ ప్యాలెస్‌లు కూడా ఉంటాయి. ఈ ప్యాలెస్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటి హోదా కూడా ఇచ్చారు. భారతదేశంలో నిర్మించిన ఏ కట్టడం కన్నా దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్యాలెస్‌లో 170 గదులు ఉన్నాయి. అనేక తోటలు ఉన్నాయి. ఇందులో చాలా సినిమాల షూటింగ్‌లు జరిగాయి.
ఇది బరోడా రాజకుటుంబ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అన్నమాట. 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం. పోల్చి చూస్తే, బ్రిటన్ బకింగ్‌హామ్ ప్యాలెస్ పరిమాణం నాల్గవ వంతు మాత్రమే. అంటే 25 శాతం అన్నమాట. మహారాజా సాయాజీరావు గైక్వాడ్ 1880లో ఈ ప్యాలెస్‌ని నిర్మించారు. అప్పుడు దాని ధర 18 వేల గ్రేట్ బ్రిటన్ పౌండ్స్(GBP). రూపాయిల్లో చూస్తే అప్పుడు మొత్తం ధర రూ.19,06,950కోట్లు అన్నమాట. అయితే, నేడు ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన ఆస్తిగా మారింది.
2012లో తన తండ్రి రంజిత్‌సింగ్ ప్రతాప్‌సింగ్ గైక్వాడ్ మరణానంతరం లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకున్న హెచ్‌ఆర్‌హెచ్ సమర్జిత్‌సింగ్ గైక్వాడ్ ఇప్పుడు యజమాని. అతను 2002 సంవత్సరంలో వాంకనేర్ రాష్ట్రంలోని రాజ కుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నాడు. రాధిక జర్నలిస్టు. సమర్జీత్‌కు ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
170 గదులు..
వడోదర రాజకుటుంబం నివసించే ప్యాలెస్‌లో 170 గదులు ఉన్నాయి. ఈ ప్యాలెస్ 170 ఎకరాల్లో విస్తరించి ఉంది. మిగిలిన స్థలంలో తోటలు, ఈత కొలనులు ఉన్నాయి. ఈ ప్యాలెస్ ప్రస్తుత ధర సుమారు రూ. 24 వేల కోట్లు. ఇది భారతదేశంలో నిర్మించిన ప్రైవేట్ నివాసాలలో అత్యధిక ధర కలిగినది.