Indian Railway: ప్రయాణికులకు అలర్ట్.. టిక్కెట్ల విషయంలో కొత్త రూల్స్.. భారీ ఊరటనిచ్చిన రైల్వే శాఖ..!
Indian Railway Train Ticket Rules: మీరు కూడా రైలు టిక్కెట్‌ను బుక్ చేయబోతున్నట్లయితే లేదా ప్లాన్ చేస్తున్నట్లయితే, దాని నిబంధనలను రైల్వేలు మార్చాయి. రైలు టికెట్ బుకింగ్‌కు సంబంధించి రైల్వే కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఇది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
Indian Railways Latest Update: తరచుగా ట్రైన్ జర్నీ చేస్తున్నారా.. అయితే, మీకో గుడ్‌న్యూస్ వచ్చంది. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. కాబట్టి మీరు కూడా రైలు టిక్కెట్‌ను బుక్ చేయబోతున్నట్లయితే లేదా ప్లాన్ చేస్తున్నట్లయితే, దాని నిబంధనలను రైల్వేలు మార్చాయి. రైలు టికెట్ బుకింగ్‌కు సంబంధించి రైల్వే కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఇది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
మీరు ఎవరికైనా మీ టిక్కెట్‌ను బదిలీ చేయగల రైల్వే నియమం గురించి ఈ రోజు తెలుసుకుందాం.. అంటే, ప్రయాణీకుడు తన టిక్కెట్టును తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త, భార్య వంటి కుటుంబ సభ్యులకు బదిలీ చేయవచ్చు.
మీ టిక్కెట్‌ను ఎవరికి బదిలీ చేయవచ్చంటే..
రైల్వే నిబంధనల ప్రకారం, మీరు మీ టిక్కెట్‌ను తల్లిదండ్రులు, తోబుట్టువులు, కొడుకు-కుమార్తె లేదా భార్య వంటి మీ కుటుంబ సభ్యుల పేరు మీద మాత్రమే బదిలీ చేయవచ్చు. అంటే మీ సన్నిహితులు మీ టిక్కెట్‌పై ప్రయాణించలేరన్నమాట.
బదిలీ టిక్కెట్‌ను ఎలా పొందాలి..
టిక్కెట్‌ను బదిలీ చేయడానికి, ముందుగా మీరు ఆ టికెట్ ప్రింటవుట్‌ను తీసుకొని దానితో మీ సమీప రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. టికెట్ ఎవరి పేరు మీద బదిలీ చేయాలనుకుంటున్నారో.. వారి ఆధార్ కార్డ్ వంటి ID రుజువును తీసుకెళ్లాలి. దరఖాస్తు చేయడం ద్వారా మీరు టికెట్ బదిలీ కోసం దరఖాస్తును ఇవ్వాల్సి ఉంటుంది.
24 గంటల ముందుగానే బదిలీ చేయాలి..
రైల్వే నిబంధనల ప్రకారం వేరొకరి పేరుకు టికెట్ బదిలీ చేయడానికి 24 గంటల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి.
ఒక్కసారి మాత్రమే అవకాశం..
మీరు మీ టిక్కెట్‌ను ఒక్కసారి మాత్రమే బదిలీ చేయగలరు. అంటే, మీరు అదే టిక్కెట్‌ను మరల మరల మరొకరి పేరుతో మార్చలేరు.