Unique Railway Station: ఒక స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. దేశంలోనే ఏకైక రైల్వే స్టేషన్.. ఎక్కడుందో తెలుసా?
Indian Railways Interesting Facts: భారతీయ రైల్వేలో మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఓ రేల్వే స్టేషన్.. రెండు రాష్ట్రాల మధ్య నిర్మించిన ఓ రైల్వే స్టేషన్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ ఎక్కడ నిర్మించారో తెలుసుకుందాం.
Indian Railways Interesting Facts: భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా పేరుగాంచింది. దీని ద్వారా ప్రతిరోజూ 40 మిలియన్ల మంది ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను అందిస్తున్న ప్రభుత్వ సంస్థ కూడా ఇదే. అయితే భారతీయ రైల్వేలో మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఓ రేల్వే స్టేషన్.. రెండు రాష్ట్రాల మధ్య నిర్మించిన ఓ రైల్వే స్టేషన్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ ఎక్కడ నిర్మించారో తెలుసుకుందాం..
ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ నిర్మించారంటే..
ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ పేరు నవాపూర్ రైల్వే స్టేషన్. ఇది మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఉంది. ఈ స్టేషన్‌లో సగం గుజరాత్‌లోని తాపి జిల్లాలో, మరొక భాగం మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో నిర్మించారు. ఈ స్టేషన్ భారతీయ రైల్వేలోని పశ్చిమ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషన్‌లోని అన్ని విషయాలు రెండు రాష్ట్రాల మధ్య విభజించారు. స్టేషన్ మధ్యలో ఒక లైన్ గీశారు. ఒకవైపు మహారాష్ట్ర, మరోవైపు గుజరాత్ రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి.
మహారాష్ట్ర-గుజరాత్ రాష్ట్రాల్లో స్టేషన్..
నవాపూర్ రైల్వే స్టేషన్‌లో ఒక బెంచ్ కూడా ఉంది. ఇందులో సగం గుజరాత్ రాష్ట్రంలో, సగం మహారాష్ట్రలో ఉంది. బెంచీకి ఇరువైపులా పెయింట్‌తో మహారాష్ట్ర, గుజరాత్ అని స్పష్టంగా రాశారు. ఈ స్టేషన్‌కు వచ్చే చాలా మంది ప్రజలు ఈ బెంచ్‌పై కూర్చుని సెల్ఫీలు తీసుకుంటారు. దీనితో పాటు, స్టేషన్‌లో ఒక సెల్ఫీ పాయింట్ కూడా నిర్మించారు. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన వారు ఇదే పాయింట్ నుంచి సెల్ఫీలు తీసుకుంటుంటారు.
స్టేషన్‌లో 4 ప్లాట్‌ఫారమ్‌లు..
ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ మొత్తం పొడవు 800 మీటర్లు. వీటిలో దాదాపు 500 మీటర్ల గుజరాత్, మిగిలిన 300 మీటర్లు మహారాష్ట్ర కిందకు వస్తాయి. ఈ రైల్వే స్టేషన్‌లో 4 రైల్వే ట్రాక్‌లు, 3 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నవాపూర్ రైల్వే స్టేషన్ టిక్కెట్ విండో మహారాష్ట్ర సరిహద్దులో ఉండగా, స్టేషన్ మాస్టర్ గుజరాత్ సరిహద్దులో కూర్చుంటాడు.
రైల్వే ప్రకటన 4 భాషలలో..
ఈ స్టేషన్‌లో (నవాపూర్ రైల్వే స్టేషన్) వినిపించే ప్రకటన కేవలం ఒకటి రెండు భాషల్లో కాదు.. మొత్తం 4 భాషల్లో వినిపిస్తుంటారు. ఇక్కడ ప్రయాణీకుల కోసం హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ భాషలలో ప్రకటనలు వినిపిస్తుంటారు. అంతే కాదు రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమాచార బోర్డులపై కూడా ఈ నాలుగు భాషల్లో రాసి ఉండడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నాయి.
స్టేషన్ ఆసక్తికరమైన చరిత్ర..
నవాపూర్ రైల్వే స్టేషన్‌ను రెండు రాష్ట్రాల మధ్య విభజించడం వెనుక కూడా ఆసక్తికరమైన కథనం ఉంది. నిజానికి ఈ స్టేషన్ మహారాష్ట్ర, గుజరాత్ విభజనకు ముందు నిర్మించారు. కానీ మే 1, 1961న ముంబై ప్రావిన్స్ మహారాష్ట్, గుజరాత్ అనే రెండు రాష్ట్రాలుగా విభజించారు. ఈ విభజన కింద నవాపూర్ రైల్వే స్టేషన్ కూడా రెండు రాష్ట్రాల మధ్య సగానికి విభజించారు. అప్పటి నుంచి ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేక గుర్తింపుగా మారింది.