IRCTC: ఒక్కపైసా చెల్లించాల్సిన పనిలేదు.. టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడే డబ్బులు పే చేయండి.. ఐఆర్‌సీటీసీ నుంచి కొత్త ఫీచర్..!

గత కొన్నేళ్లుగా రైల్వేశాఖ ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలను మెరుగుపరిచింది. ఇప్పుడు రైళ్లలో బుకింగ్ ప్రక్రియను కూడా మరింత సులభతరం చేశారు.

Update: 2024-08-13 07:30 GMT

IRCTC: ఒక్కపైసా చెల్లించాల్సిన పనిలేదు.. టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడే డబ్బులు పే చేయండి.. ఐఆర్‌సీటీసీ నుంచి కొత్త ఫీచర్..!

IRCTC iPay Feature: భారతీయ రైల్వేలలో ప్రయాణించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి రిజర్వ్‌డ్, మరొకటి అన్‌రిజర్వ్‌డ్. అంటే, ఒకదానిలో మీరు ముందుగానే రైలులో సీటును బుక్ చేసుకుని, మీకు కేటాయించిన సీటులో ప్రయాణించడం. మరొకటి స్టేషన్‌కి వెళ్లి జనరల్ టిక్కెట్‌ను కొనుగోలు చేసి, జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కడ సీట్ దొరకితే, అక్కడ కూర్చొని ప్రయాణించడం. ప్రయాణం ఎక్కువైతే జనరల్ కోచ్‌లో పెద్ద సమస్య ఉంటుంది. అందుకే ప్రయాణ సమయంలో ప్రజలు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు.

అయితే, కొన్నిసార్లు రిజర్వేషన్ చేసినా, సీటు కన్ఫర్మ్ కాదు. టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటుంది. బుకింగ్ చేస్తున్నప్పుడు చాలా సార్లు మీకు కన్ఫర్మ్ సీటు లభించదు. కాబట్టి, మీరు మళ్లీ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మీ డబ్బు రెండుసార్లు కట్ అవుతుంది. చాలా మంది ఖాతాలో రెండు సార్లు బుక్ చేసుకునేంత డబ్బు లేదు. ఇందుకోసం IRCTC కొత్త ఫీచర్‌ని అందించింది. ఇందులో మీ టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే మీ డబ్బు కట్ అవుతుంది.

IRCTC ఆటో పే ఫీచర్..

గత కొన్నేళ్లుగా రైల్వేశాఖ ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలను మెరుగుపరిచింది. ఇప్పుడు రైళ్లలో బుకింగ్ ప్రక్రియను కూడా మరింత సులభతరం చేశారు. ఇంతకు ముందు ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు చాలా సార్లు టిక్కెట్లు వెయిటింగ్ లిస్టులో ఉండేవి. ఖాతా నుంచి డబ్బు కూడా కట్ అయ్యేది. అయితే ఇప్పుడు రైల్వేశాఖ ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు కల్పిస్తోంది. దీని కింద ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడే వారి ఖాతా నుంచి డబ్బు బదిలీ అవుతుంది.

ఈ కొత్త ఫీచర్ పేరు iPay ఆటో పే, మీరు IRCTC యాప్ లేదా IRCTC వెబ్‌సైట్ ద్వారా iPay ఫీచర్‌ని పొందవచ్చు. దీని ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే వెంటనే మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అవ్వవు. బదులుగా, మీ టికెట్ మొత్తం మీ ఖాతా నుంచి బ్లాక్ అవుతుంది. కానీ మీ టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుంది.

రీఫండ్‌లో కూడా వెసులుబాటు..

మీరు ఈ ఫీచర్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే, మీ టికెట్ రద్దు చేస్తే, వాపసు పొందడానికి మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. iPayలోకి వెంటనే వచ్చేస్తాయి.

Tags:    

Similar News