Lower Berth: టిక్కెట్ల రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇకపై ఆ రైళ్లలో లోయర్ బెర్త్ సీట్లు దక్కాలంటే కష్టమే..!
Indian railway Rules: చాలా సార్లు, రైలులో సుదీర్ఘ ప్రయాణం కారణంగా, చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి ప్రజలు రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటానికి లోయర్ బెర్త్‌లను ఎంచుకోవడానికి ఇష్టపడుతుంటారు.
చాలా సార్లు, రైలులో సుదీర్ఘ ప్రయాణం కారణంగా, చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి ప్రజలు రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటానికి లోయర్ బెర్త్‌లను ఎంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే, వైకల్యం ఉన్న ప్రయాణికులకు దూర ప్రయాణాలు చాలా కష్టంగా మారుతుంటాయి. ఇందుకోసం వికలాంగుల కోసం భారతీయ రైల్వే కొత్త అడుగు వేయనుంది.భారతీయ రైల్వే దివ్యాంగుల ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు, రైళ్లలో లోయర్ బెర్త్‌లు వారి కోసం రిజర్వ్ చేయనుంది. అయితే, ఈ కొత్త ప్రారంభం దేశవ్యాప్తంగా నడుస్తున్న అన్ని రకాల రైళ్లకు వర్తించదంట.
ఈ సీట్లు రిజర్వ్ చేయనున్నారు..
కొన్ని రైళ్లలో ప్రయాణ సమయంలో లోయర్ బెర్త్‌లను ఎంచుకోవడంలో వికలాంగులు, వారి అటెండెంట్‌లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మీడియా కథనాల ప్రకారం, ఈ ప్రయాణికుల కోసం రైల్వే దిగువ బెర్త్‌లలో నాలుగు సీట్లను కేటాయించింది. కొత్త మార్పుల ప్రకారం, ఇప్పుడు స్లీపర్ క్లాస్‌లో నాలుగు బెర్త్‌లు - రెండు దిగువ , రెండు మధ్య సీట్లు దివ్యాంగులు, వారితో పాటు వచ్చే అటెండర్‌లకు రిజర్వ్ చేయనున్నారు. అదే సమయంలో AC 3 టైర్‌లో 2 బెర్త్‌లు: 1 లోయర్ బెర్త్, 1 మిడిల్ బెర్త్ రిజర్వ్ చేయనున్నారు.
భారతీయ రైల్వే ఈ కొత్త నిర్ణయంతో, దివ్యాంగ్ ప్రయాణీకులు మరింత సౌకర్యంగా, సులభంగా రైలు ప్రయాణాన్ని ఆస్వాదించగలరు.లోయర్ బెర్త్‌లు వికలాంగులకు పైకి లేవడానికి, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి గొప్ప సహాయంగా ఉంటాయి. మహిళా ప్రయాణికులు, పిల్లలతో ఉన్న మహిళలు, వృద్ధ ప్రయాణికులు బెర్త్‌లను ఎంచుకునే అవకాశం ఇప్పటికే ఉంది.
ఏ రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది?
భారతీయ రైల్వే ఈ సదుపాయాన్ని వికలాంగ ప్రయాణీకులు వారి అటెండర్‌తో ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మెయిల్ రైళ్లలో మాత్రమే ఉపయోగించుకోవచ్చు. AC చైర్ కార్ రైళ్లలో, ఈ ప్రయాణికుల కోసం 2 సీట్లు రిజర్వ్ చేయనున్నారు. గరీబ్ రథ్ రైళ్లలో 2 లోయర్ బెర్త్‌లు, 2 అప్పర్ బెర్త్‌లు ఇప్పుడు దివ్యాంగుల కోసం రిజర్వ్ చేయనున్నారు. ఈ కొత్త సౌకర్యాన్ని పొందేందుకు ఈ ప్రయాణికులు సహేతుకమైన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.