Indian Railways: డబుల్ ఇంజిన్ రైళ్లలో డ్రైవర్లు ఎంతమంది ఉంటారు? సమాధానం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Double Engine Trains: డీజిల్ ఇంజన్ రైళ్లు వచ్చినప్పుడు కూడా డబుల్ ఇంజన్ వినియోగాన్ని కొనసాగించారు. రైళ్లు పొడవుగా మారడంతో, డీజిల్ ఇంజిన్‌లో కూడా డబుల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ముఖ్యంగా బొగ్గు రవాణా లేదా గూడ్స్ రవాణా రైళ్లు ఒక ఇంజన్‌తో నడపడం కష్టం.

Update: 2023-05-05 13:30 GMT

Indian Railways: డబుల్ ఇంజిన్ రైళ్లలో డ్రైవర్లు ఎంతమంది ఉంటారు? సమాధానం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Indian Railways: కొన్ని రైళ్లకు డబుల్ ఇంజిన్ అంటే రెండు లోకోమోటివ్ ఇంజిన్‌లు ఉంటాయి. ఇలాంటి స్పెషల్ ట్రైన్స్‌కు ఒక లోకోమోటివ్ వెనుక మరొకటి జోడిస్తారు. చాలా పొడవైన, భారీగా లోడ్ ఉన్నప్పుడు రెండు ఇంజిన్ల ద్వారా సులభంగా వెళ్లేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే, డబుల్ ఇంజిన్ రైలులో, డ్రైవర్లు లేదా లోకో పైలట్లు రెండు ఇంజిన్లలో ఉంటారా? లేదా అనే డౌట్ ఉంటుంది. ఒక లోకో పైలట్, ఒక అసిస్టెంట్ లోకో పైలట్ మాత్రమే మొదటి లోకోమోటివ్‌తో ముందంజలో కూర్చుని రెండవ ఇంజిన్‌ను నియంత్రిస్తారు.

డబుల్ ఇంజన్ వాడకం?

లోకో పైలట్ రెండు లోకోమోటివ్‌లను నియంత్రిస్తుంటాడు. డబుల్ ఇంజిన్ రైలు వెనుక ఉన్న ఇంజిన్‌ను సాధారణంగా స్విచ్ ఇంజిన్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో రైళ్లు ఆవిరి ఇంజిన్లతో నడిచే సమయంలో అవి చాలా చిన్నవిగా ఉండేవి. 1950-60 దశాబ్దంలో, చాలా రైళ్లలో ఐదు లేదా ఆరు కోచ్‌లు ఉండేవి. వాటి కారణంగా అవి చాలా తేలికగా ఉండేవి. కానీ, తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ కోచ్‌లను కలిగి ఉండే రైళ్లు కూడా ఆ తర్వాత వచ్చాయి. ఈ రైళ్లను నడపడానికి ఒక ఆవిరి యంత్రం సరిపోదు. అందుకోసం ఈ రైళ్లకు రెండు స్టీమ్ ఇంజన్లు జోడించేవారు.

డబుల్ ఇంజన్ వాడకం ఎప్పటినుంచంటే..

డీజిల్ ఇంజన్ రైళ్లు వచ్చినప్పుడు కూడా డబుల్ ఇంజన్ వినియోగాన్ని కొనసాగించారు. రైళ్లు పొడవుగా మారడంతో, డీజిల్ ఇంజిన్‌లో కూడా డబుల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ముఖ్యంగా బొగ్గు రవాణా లేదా గూడ్స్ రవాణా రైళ్లు ఒక ఇంజన్‌తో నడపడం కష్టం. ఆవిరి ఇంజిన్‌లో 1250 హార్స్ పవర్ ఉపయోగిస్తుంటారు. అయితే తర్వాత డీజిల్ ఇంజిన్‌లో 2000 హార్స్ పవర్ ఉపయోగించేవారు. నేటి కాలంలో, ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ల సామర్థ్యం చాలా పెరిగింది. ఇది 5000 నుంచి 12000 హార్స్ పవర్ వరకు ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, డబుల్ ఇంజిన్‌ అవసరం లేదు. ఎందుకంటే ఒక ఇంజిన్‌తోనే పెద్ద గూడ్స్ రైలును సులభంగా లాగగలదు.

ప్రస్తుతం MU సాంకేతికతతో..

ఇప్పటికీ కొన్ని రైల్వే విభాగాలు ఉన్నాయి. అక్కడ లోయలు, కొండలు కారణంగా రైళ్లను తరలించడంలో ఇబ్బంది ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, వాహక సామర్థ్యాన్ని పెంచడానికి, రైళ్లు తమ వేగాన్ని సురక్షితంగా నిర్వహించడానికి వీలుగా డబుల్ ఇంజన్లను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు లోకోమోటివ్‌కు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా జోడిస్తుంటారు. ఇది బహుళ యూనిట్ల ప్రారంభానికి దారితీసింది. MU కారణంగా, ఇప్పుడు ఏదైనా రైలులో డబుల్, ట్రిపుల్ లేదా 4 ఇంజిన్‌ల వరకు జోడించడం ద్వారా రైలును లాగుతుంటారు. నాలుగు ఇంజన్లతో కూడిన రైలును పైథాన్ రైలు అంటారు.

Tags:    

Similar News