Google new feature: నెట్టింట్లో మీ విజిటింగ్ కార్డు.. గూగుల్ సరికొత్త ఫీచర్!
Google new feature: గూగుల్ సరికొత్త ఫీచర్.. ఉపయోగించడం ఎలా?
గూగుల్.. ఏ చిన్న సమాచారం కావాలన్నా ప్రస్తుతం మెజారిటి జనం ఆధారపడుతున్న అంతర్జాల సమాచార వేదిక. గూగుల్ సహాయం కోసం ప్రయత్నించని నెటిజన్లు ఉండరంటే అతిశయోక్తి కాబోదు. ఎప్పటికప్పుడు గూగుల్ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తూ ఉంటుంది. తాజాగా వర్చువల్ విజిటింగ్ కార్డు ఆప్షన్ తీసుకువస్తోంది.
ఏమిటీ వర్చువల్ విజిటింగ్ కార్డ్?
పీపుల్స్ కార్డ్ గా పిలిచే ఈ వర్చువల్ విజిటింగ్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరి సమాచారం గూగుల్ సెర్చింజన్ లో దొరుకుతుంది. సాధారణ విజిటింగ్ కార్డులో ఉండే సమాచారం అంతాఈ పీపుల్స్ కార్డ్ లో కనిపిస్తుంది. నెట్లో తమ వివరాలు అన్నీ పొండుపరుచుకోవాలనే వ్యక్తులకు ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.
గూగుల్ లో పీపుల్ కార్డ్ ఇలా చేసుకోవచ్చు..
- గూగుల్ లో సైన్ ఇన్ కావాలి
- గూగుల్ సెర్చ్ లో 'add to me search'అని టైప్ చేయాలి.
- వివరాలు నమోదు చేయడానికి వీలుగా ఒక విండో ఓపెన్ అవుతుంది.
- అందులో మీ వివరాలు నింపాలి.
- దీనికి ఫోటోలు, సోషల్ మీడియా లింక్స్ కూడా జత చేసుకోవచ్చు
- గూగుల్ వెరిఫికేషన్ కోసం మీ ఫోన్ నెంబర్..ఈ మెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది.
- మీ వివరాలు పబ్లిక్ కి అందుబాటులో ఉంచాలా వద్దా అనే ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంది. దానిని ఎంచుకోవాలి
-సబ్మిట్ కొడితే చాలు.. మీ వర్చువల్ విజిటింగ్ కార్డ్ సిద్ధం అయిపోతుంది.
- ఒక ఈ మెయిల్ ఎకౌంట్ పై ఒక్కటే పబ్లిక్ కార్డు చేసుకోవచ్చు. ప్రతి ఎకౌంట్ కు వేర్వేరు ఫోన్ నెంబర్లను ఇవ్వాల్సి ఉంటుంది.