ఈ IAS ఆఫీసర్ ని మనం అభినందిద్దాం...

Update: 2019-10-29 09:13 GMT

ప్రభుత్వ ఆసుపత్రిలు అంటే కేవలం పేద వాళ్ళకి మాత్రమే అనే ఓ ముద్ర పడిపోయింది. ఈ పేరును రూపుమాపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా కృషి చేస్తున్నాయి. ఇప్పుడు గతంతో చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందనే చెప్పాలి . ఇక ఇది ఇలా ఉంటే ఓ కలెక్టర్ తన భార్యకి పురిటినొప్పులు వస్తే  ప్రసవం కోసం  ప్రైవేటు ఆసుపత్రిలో కాకుండా ఓ సాధారణమైన ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాడు. వాస్తవానికి తానూ అనుకుంటే ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చేర్చొచ్చు. మళ్ళీ అందులో తొలి కాన్పు.. రిస్క్ ఎందుకు అని అనుకోవచ్చు కానీ అలా అనుకోలేదు. దైర్యమో లేకా ప్రజలతో మనం కూడా సమానమే అనుకున్నాడు ఏమో కానీ ఈ పని చేసాడు. ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇంతకి ఆ IAS ఆఫీసర్ ఎవరంటే భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతం IAS .. 2013-2014 బ్యాచ్.. 138 ర్యాంక్.. ఫస్ట్ టైం లోనే సివిల్స్ ని కొట్టేశాడు . ఈ IAS అధికారి చేసిన పనికి మనం అభినందించాల్సిందే కదా మరి..  




 


Tags:    

Similar News