India Elections 2024: మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో ఇలా సింపుల్‌గా తెలుసుకోండి...!

Election - Polling Station: ఎన్నికల అధికారులు పంపిణీ చేసే ఓటరు స్లిప్పులు మీకు చేరలేదా... మీరు ఓటు హక్కును వినియోగించుకొనే పోలింగ్ కేంద్రం వివరాలు తెలియక ఆందోళన చెందుతున్నారా...

Update: 2024-05-11 13:00 GMT

2024 India Elections: మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో ఇలా సింపుల్‌గా తెలుసుకోండి...!

Find My Polling Station: ఎన్నికల అధికారులు పంపిణీ చేసే ఓటరు స్లిప్పులు మీకు చేరలేదా... మీరు ఓటు హక్కును వినియోగించుకొనే పోలింగ్ కేంద్రం వివరాలు తెలియక ఆందోళన చెందుతున్నారా...ఈ విషయమై ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఆన్ లైన్ లో మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకొనే వెసులుబాటును ఈసీ కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకొనే అవకాశం కలుగుతుంది.

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఓటర్ హెల్ప్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని.. అందులోని నో యువర్ పోలింగ్ స్టేషన్ కేటగిరిలో మీ వివరాలు నింపితే మీ పోలింగ్ కేంద్రం వివరాలు తెలుస్తాయి. లేదా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ www.eci.gov.in లో నో యువర్ పోలింగ్ స్టేషన్ కేటగిరిలోకి వెళ్లి వివరాలు నమోదు చేస్తే మీ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. ఓటర్ హెల్ప్ నెంబర్ 1950 కి ఫోన్ చేయడం ద్వారా కూడ పోలింగ్ కేంద్రం సమాచారం తెలుసుకొనే అవకాశం ఉంటుంది.

గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారం సులభంగా తెలుస్తుంది. ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లను తీసుకెళ్లేందుకు పోలింగ్ కేంద్రాల వివరాలను ఓటర్లకు అందిస్తారు. కానీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ స్టేషన్ల వివరాలు తెలుసుకోవడం కొంత ఇబ్బందే. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అధికారులు ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. ఓటరు స్లిప్పులు అందని వారు తమ పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకోనేందుకు ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చని ఈసీ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 13 ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కు పోలింగ్ జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News