Viral photo: సాగరతీరాన అందాల కెరటం... ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.?

Viral photo: సోషల్‌ మీడియాల.. ఎంతో మంది సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చింది. రాత్రికి రాత్రి సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.

Update: 2024-10-06 15:00 GMT

Viral: సాగరతీరాన అందాల కెరటం... ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.?

Viral photo: సోషల్‌ మీడియాల.. ఎంతో మంది సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చింది. రాత్రికి రాత్రి సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెంచుకోవడంతో షార్ట్‌ ఫిలిమ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. దీంతో పాపులర్‌ అయ్యి ఏకంగా బిగ్‌బాస్‌లోకి ఏంట్రీ ఇచ్చారు. ఇప్పుడు టాప్‌ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.

అలాంటి వారిలో ఒకరు పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ. సముద్రం తీరాన అందాల కెరటంలా కనిపిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? సాధారణ వ్యక్తి నుంచి సెలబ్రిటీ హోదాకు ఎదిగిందీ బ్యూటీ. షార్ట్‌ ఫిలిమ్స్‌లో తన క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది ఏకంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లింది. ఇప్పుడు పలు షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటిస్తూ మెప్పిస్తోంది. అదే విధంగా నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్‌ క్యూట్ ఫొటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.

ఇంతకీ ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? మరెవరో కాదు.. దీప్తి సునైనా. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ విప్లవం. దీప్తికి సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఏకంగా 42 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటేనే ఈ బ్యూటీ క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే పలు బ్రాండ్స్‌ సైతం ప్రమోషన్స్‌ కోసం ఈమెతో ఒప్పందం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీప్తి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. గతంలో దిగిన అన్ని ఫొటోలను కలిపి ఒక పోస్ట్ చేసింది. వీటిలో ఇదిగో ఈ సముద్రం ఒడ్డున దిగిన ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.


Tags:    

Similar News