Baal Aadhaar: అప్పుడే పుట్టిన పిల్లలకి ఆధార్ ఎలా.. ప్రాసెస్ తెలుసుకోండి..!
Baal Aadhaar: ఇండియాలో ఇప్పుడు ఆధార్ కార్డు లేనిదే ఏ పని జరుగదు. ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డుగా మారిపోయింది...
Baal Aadhaar: ఇండియాలో ఇప్పుడు ఆధార్ కార్డు లేనిదే ఏ పని జరుగదు. ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డుగా మారిపోయింది. దీనిని UIDAI 12 అంకెలతో జారీ చేస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా ఆధార్ కార్డు అవసరం. పాఠశాల అడ్మిషన్ ప్రక్రియ సమయంలో ఆధార్ నంబర్‌ను అడుగుతున్నాయి. మీరు ఇప్పటికీ మీ పిల్లలకి ఆధార్ కార్డు తీసుకోకుంటే వెంటనే దరఖాస్తు చేయండి. నవజాత శిశువులు, ఐదేళ్ల పిల్లలు ఎవరైనా సరే ఆధార్ కార్డు కోసం అప్లై చేయవచ్చు.
ఇక ఆధార్ లేకపోతే వారికి ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇక నవజాత శిశువులకు కూడా ఆధార్ కావాల్సిందే. దేశంలోని కొన్ని ఆసుపత్రులలో అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఆధార్ కార్డు తయారు చేసే ప్రక్రియను కల్పిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈ ఆధార్ కార్డు ఉండాల్సిందే. నవజాత శిశువుకి ఆధార్ అప్లై చేయాలంటే పిల్లల బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రులలో ఒకరి గుర్తింపు కార్డు అవసరం. అయితే ఇక్కడ ఎలాంటి ఫింగర్ ఫ్రింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
బయోమెట్రిక్ డేటా అనేది 5 సంవత్సరాలు దాటిన పిల్లలకి మాత్రమే తీసుకుంటారు. బాల్ ఆధార్ తీసుకున్న తర్వాత పిల్లలకు 5 సంవత్సరాలు వచ్చినప్పుడు బయోమెట్రిక్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ముందుగా UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ కోసం లింక్ పై క్లిక్ చేయాలి. అనంతరం అప్లై ఫాం పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లల పేరు, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు సమీపంలోని ఆధార్ కార్డు సెంటర్‌కు అపాయింట్ మెంట్ లభిస్తుంది. అవసరమైన సర్టిఫికేట్స్ తీసుకొని అపాయింట్ మెంట్ ఉన్న రోజు.. టైమింగ్ ప్రకారం ఆధార్ సెంటర్‌కు వెళ్ళి ఆధార్ నమోదు చేసుకోవాలి. కొన్ని రోజుల్లోనే మీకు ఆధార్ ఇంటికి వస్తుంది.