Viral news: ఆటో అన్న ఐడియా అదుర్స్‌.. వైరల్‌ అవుతోన్న క్యూఆర్‌ కోడ్‌ ఫొటో

బెంగళూరులో ఆటో ఎక్కిన ఓ కస్టమర్‌ పేమెంట్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ను చూపించమని అడిగాడు. దీంతో ఆటో డ్రైవర్‌ వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌లోని కోడ్‌ని చూపించాడు. అది చూసిన కస్టమర్‌ ఆశ్చర్యపోయాడు.

Update: 2024-09-22 04:10 GMT

Viral news: ఆటో అన్న ఐడియా అదుర్స్‌.. వైరల్‌ అవుతోన్న క్యూఆర్‌ కోడ్‌ ఫొటో

ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకు ప్రతీ ఒక్కరూ డిజిటల్‌ పేమెంట్స్‌ను స్వీకరించే రోజులు వచ్చేశాయ్‌. దీంతో చిల్లర సమస్య దాదాపుగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే చిల్లర పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు వెంటనే జేబులో నుంచి స్మార్ట్‌ ఫోన్‌ తీసిన సెకండ్స్‌లో పేమెంట్స్‌ చేసేస్తున్నారు.

దీంతో ప్రతీ షాపులో క్యూఆర్‌ కోడ్‌లు దర్శనమిస్తున్నాయి. చివరికి ఆటోల్లో కూడా క్యూఆర్‌ కోడ్‌లు కనిపిస్తాయి. అయితే క్యూఆర్‌ పబ్లిక్‌ ప్లేస్‌లో పెట్టే క్యూఆర్‌ కోడ్‌లను కొందరు మార్చేస్తూ డబ్బులు కాజేస్తున్న సంఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చిన వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే అచ్చంగా ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే అన్నట్లు బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ వినూత్నంగా ఆలోచించాడు. స్మార్ట్ వాచ్‌లో క్యూఆర్‌ కోడ్‌ చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

బెంగళూరులో ఆటో ఎక్కిన ఓ కస్టమర్‌ పేమెంట్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ను చూపించమని అడిగాడు. దీంతో ఆటో డ్రైవర్‌ వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌లోని కోడ్‌ని చూపించాడు. అది చూసిన కస్టమర్‌ ఆశ్చర్యపోయాడు. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘‘ఎక్స్‌’’ వేదికగా పంచుకున్నాడు. సంబంధిత ఫొటోనూ యాడ్‌ చేశాడు. అంతే ఆ పోస్ట్‌ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే డిజిటల్‌ భారతం సాకారమవుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News