Driving Tips: రాత్రిపూట డ్రైవింగ్‌ చేస్తున్నారా.. గమ్యం చేరాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Car Driving Tips: సురక్షితమైన డ్రైవింగ్ మీకు మాత్రమే కాకుండా ఇతరులకి కూడా చాలా ముఖ్యం.

Update: 2023-05-16 15:30 GMT

Driving Tips: రాత్రిపూట డ్రైవింగ్‌ చేస్తున్నారా.. గమ్యం చేరాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Car Driving Tips: సురక్షితమైన డ్రైవింగ్ మీకు మాత్రమే కాకుండా ఇతరులకి కూడా చాలా ముఖ్యం. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అలసట, రాత్రి డ్రైవింగ్ కారణంగా సడెన్‌గా నిద్రలోకి జారుకుంటారు. దీనివల్ల పెను ప్రమాదాలు జరుగుతాయి. ఇటువంటి సమయాలలో కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించవచ్చు. దీనివల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

కారును రోడ్డు పక్కన పార్క్‌ చేయండి

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర వచ్చినట్లు అనిపిస్తే సురక్షితంగా ఉండటానికి వాహనాన్ని కొంతసేపు రోడ్డు పక్కన పార్క్ చేయండి. తర్వాత కొద్దిసేపు అటు ఇటు నడవండి. శరీరాన్ని యాక్టివ్ మోడ్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. వీలైతే ఒంటరి ప్రదేశంలో ఉండండి ఎందుకంటే ఇతరులు సమస్యలను కలిగించవచ్చు.

పాటలు వినండి

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోతున్నట్లు అనిపిస్తే మంచి పాటలు వినండి. అంతేకాదు వాటిని హమ్ చేయండి. ఇది మిమ్మల్ని నిద్ర నుంచి దూరం చేస్తుంది. దీంతో మీరు సురక్షితంగా వాహనాన్ని నడుపుతారు.

టీ-కాఫీ తాగండి

నిద్ర వచ్చినప్పుడు టీ లేదా కాఫీ తాగడం ఉత్తమం. ఈ రోజుల్లో హైవేపై ప్రతిచోటా ధాబాలు లేదా రెస్టారెంట్లు వెలిసాయి. ఇక్కడ మీరు టీ లేదా కాఫీ తాగవచ్చు. ఈ రెండింటిలో కాఫీ ఉత్తమం ఎందుకంటే ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని కొన్ని గంటలపాటు మేల్కొని ఉంచుతుంది. అయితే కాఫీని ఎక్కువగా తాగకూడదని గుర్తుంచుకోండి ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

తక్కువ ఆహారం తినండి

మీరు రాత్రిపూట డ్రైవ్ చేయవలసి వచ్చినప్పుడు తక్కువ ఆహారం తీసుకోండి. కడుపు నిండిన తర్వాత నిద్రపోవడం సహజం. కాబట్టి అతిగా తినకుండా ప్రయత్నించండి. దీని వల్ల అంత త్వరగా నిద్ర పట్టదు. అప్పుడప్పుడూ ఏదైనా తేలికగా తింటూ ఉండండి. దీని వల్ల శరీరంలో ఎనర్జీ మెయింటెయిన్ అయి నిద్ర రాకుండా ఉంటుంది.

Tags:    

Similar News