Donkey Milk Business: ప్రభుత్వ ఉద్యోగం రాలేదు.. గాడిదలు కొని మిలియనీర్ అయ్యాడు..!

గుజరాత్ లోని పటాన్ జిల్లాకు చెందిన ధీరేణ్ సోలంకీ అనే వ్యక్తి తనకు నచ్చిన ఉద్యోగం రాకపోవడంతో సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు.

Update: 2024-05-30 13:30 GMT

Donkey Milk Business: ప్రభుత్వ ఉద్యోగం రాలేదు.. గాడిదలు కొని మిలియనీర్ అయ్యాడు..!

Donkey Milk Business: గుజరాత్ లో చదువుకున్న వ్యక్తులు ఎక్కువగా ఉద్యోగాలు చేయరు. ఇక్కడి వారు వ్యాపారం చేయడానికి ఎక్కువగా మొగ్గుచూపుతారు. అందుకే వీరు బిజినెస్ చేసేవారిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నారు. గుజరాత్ లోని పటాన్ జిల్లాకు చెందిన ధీరేణ్ సోలంకీ అనే వ్యక్తి తనకు నచ్చిన ఉద్యోగం రాకపోవడంతో సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆవు-గేదె పాలను ఇక్కడ లీటరు రూ.60 నుంచి రూ.65 వరకు విక్రయిస్తారు. కానీ ఆ వ్యక్తి ప్రత్యేక పాల వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఏకంగా రూ.5000 నుంచి రూ.7000 వరకు విక్రయించే గాడిద పాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఏడాదికి రూ.2.5 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. గాడిద పాల వ్యాపారం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఆ వ్యక్తి మొదట్లో 20 గాడిదలను కొన్నాడు. రూ.22 లక్షలతో ఫామ్ హౌస్ నిర్మించి దాదాపు 43 ఆడ గాడిదలను పెంచాడు. మొదటి నాలుగైదు నెలల్లో ప్రత్యేకంగా ఏం ఆదాయం కనిపించలేదు. కానీ అతడు పని చేస్తూనే ఉన్నాడు. ఆవు-గేదె పాల కంటే గాడిద పాలు 70 రెట్లు ఎక్కువ ఖరీదు అని అతడికి తెలుసు. అందుకే లీటర్ గాడిద పాలను రూ.5000కు విక్రయించడం ప్రారంభించాడు. డాంకీ మిల్క్‌ వల్ల ప్రతినెలా రూ.3 నుంచి 4 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.

గాడిద పాలకు డిమాండ్

గాడిద పాలకు గుజరాత్ కంటే దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ డిమాండ్ ఉందని అతడు గమనించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించడం మొదలెట్టాడు. కర్ణాటక, కేరళ నుంచి అతనికి చాలా ఆర్డర్లు రావడం ప్రారంభించాయి. వ్యక్తిగత వినియోగం కాకుండా కాస్మెటిక్ కంపెనీలు గాడిద పాలకు కస్టమర్లుగా మారారు. పాలే కాకుండా గాడిద పాలను ఎండబెట్టి దాని పౌండర్ అమ్ముతుండేవాడు. ఈ పొడికి మంచి డిమాండ్ ఉంది. కిలో పాలపొడి ధర రూ.లక్ష వరకు పలుకుతోంది.

గాడిద పాలను ఎందుకు వాడుతారు..

గాడిద పాలలో మాంసకృత్తులు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. అయితే లాక్టోస్ ఎక్కువగా ఉంటుంది. సాధారణ పాల కంటే ఈ పాలు ఎక్కువ మేలు చేస్తాయి. ఇది సౌందర్య సాధనాలు, ఔషధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. దీని డిమాండ్, ధర రెండూ ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

Tags:    

Similar News