India Elections 2024: ఓటర్ ఐడీ కార్డు లేకున్నా ఓటు వేయొచ్చు.. కానీ ఈ లిస్టులో మీ పేరు ఉండాలి..!
India Elections 2024: ప్రస్తుతం దేశంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. పార్లమెంట్ ఎలక్షన్స్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి.
India Elections 2024: ప్రస్తుతం దేశంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. పార్లమెంట్ ఎలక్షన్స్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. మే 13 న ఓటింగ్ రోజు. ఈ రోజు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. ఓటు హక్కు ఉండి ఓటు వేయలేకపోతే వారు బతికున్నా దండగే అంటారు పొలిటికల్ అనలిస్టులు. అయితే కొంతమంది ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్తారు కానీ లిస్టులో ఓటు హక్కు ఉందా లేదా చెక్ చేసుకోరు. మరికొందరు కొత్తగా ఓటుహక్కు కోసం అప్లై చేసుకుంటారు. వారి పేరు ఓటర్ లిస్టులో ఉంటుంది కానీ వారి దగ్గరు ఓటర్ ఐడీ కార్డు ఉండదు. ఇలాంటి సమయంలో వీరు ఓటు వేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం నిర్దేశించిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి. ఈ రోజు దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటర్ ఐడీ కార్డు లేని వారు ఓటు వేసేందుకు అర్హులే అని కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 2న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీని ప్రకారం కొన్ని ప్రభుత్వం తరఫు నుంచి, ప్రభుత్వ సంస్థల తరఫు నుంచి జారీ చేసిన గుర్తింపు కార్డులను ఉపయోగించి ఓటరు లిస్ట్‌లో పేరు ఉన్నవారు ఓటు వేయవచ్చని తెలిపింది. ఆ కార్డుల గురించి తెలుసుకుందాం.
1. ఆధార్ కార్డు
2. డ్రైవింగ్ లైసెన్స్
3. పాన్ కార్డు
4. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు
5. ఏదైనా బ్యాంకు గానీ, పోస్టాఫీస్ గానీ జారీ చేసిన పాస్‌బుక్(ఆ పాస్‌బుక్‌పై అభ్యర్థి ఫోటో తప్పకుండా ఉండాలి)
6. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
7. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(జాతీయ పౌర పట్టిక) కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ 8. ఇండియా(ఆర్‌జీఐ) జారీ చేసిన స్మార్ట్ కార్డు
9. భారత పాస్‌పోర్టు
10. ఫోటోగ్రాఫ్‌తో కూడిన పెన్షన్ డాక్యుమెంట్
11. ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఫోటోగ్రాఫ్‌తో కూడిన సర్వీస్ గుర్తింపు కార్డులు (కేంద్ర, రాష్ట్ర,
12. ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ఉద్యోగులు)
13. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డులు
14. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖ నుంచి జారీ చేసిన యూనిక్ డిజేబులిటి గుర్తింపు కార్డు